ఈ సందర్భంగా ప్రధానమంత్రి లీ సన్ యూంగ్ షణ్ముగరత్నానికి అభినందనలు తెలిపారు.
ప్రధాని ఆధ్వర్యంలో పీపుల్స్ యాక్షన్ పార్టీ షణ్ముగరత్నానికి ఎన్నికల్లో మద్దతు తెలిపింది. గతంలో భారత సంతతికి చెందిన ఎస్. రామనాథన్, దేవ నారాయణ్ ఇద్దరు సింగపూర్ అధ్యక్షులుగా పని చేశారు. ప్రస్తుతం సింగపూర్ అధ్యక్షుడిగా ఎన్నికైన షణ్ముగరత్నం 2011 నుంచి 2019 వరకు ఉప ప్రధానిగా అక్కడ పని చేశారు. ఈ మధ్య కాలంలో క్యాబినేట్ లో సీనియర్ మంత్రిగా విధులు నిర్వర్తించారు. ఈయనకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆర్థికవేత్తగా గుర్తింపు ఉంది.
ఈయన సింగపూర్ లో స్థిరపడ్డ తమిళ కుటుంబంలో ఆయన 1957 లో పుట్టారు. అసలు పాయింట్ ఏమిటంటే సింగపూర్, సూపర్ అద్భుతం అని చాలా మంది చెబుతుంటారు. సింగపూర్ దాదాపు వైజాగ్ కంటే చిన్నదని తెలుసుకోవచ్చు. అయితే సింగపూర్ లో ఎక్కువ మంది ఉంటారు. అయితే అమరావతిలో భూములకు సంబంధించి అవినీతి చేసిన వ్యక్తి సింగపూర్ కు చెందిన వారు ఉన్నారు. సింగపూర్ కు చెందిన వారు ఆ దేశంలో మాత్రం అవినీతి చేయరు. కానీ వివిధ దేశాల్లో మాత్రం చాలా కంపెనీలు పెట్టి అవినీతి చేస్తున్నట్లు బయటపడింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి