ఇటీవల కాలంలో పెట్రోల్ బాదుడికి  అటు సామాన్య ప్రజలందరూ కూడా బెంబేలెత్తిపోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొంతమంది అయితే ఇక వాహనాలు అత్యవసరమైతేనే బయటికి తీస్తున్నారు తప్ప అనవసరంగా వాహనాన్ని బయటకు తీసి ఇక జేబుకు చిల్లు పెట్టుకోవాలని ఎవరు అనుకోవట్లేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మన దేశంలో ఎక్కడ చూసినా పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టేసాయి అని చెప్పాలి. అయితే ఇక ఇలా పెట్రోల్ ధర 100కు పైగా ఉండడంతో సామాన్య ప్రజలు కొంత ఇబ్బందులుపడుతున్న పరిస్థితి అందరికీ తెలుసు.


 అయితే ఇక ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 320 రూపాయలకు పెరిగింది. ఏంటి 320 రూపాయలా అని ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయింది కదా. అయితే టెన్షన్ పడకండి. ఇలా పెట్రోల్ ధర లీటరుకు 320 రూపాయలకు పెరిగింది మనదేశంలో కాదు. భారత దాయాది దేశం అయినా పాకిస్తాన్లో  ప్రస్తుతం పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో అక్కడి ప్రభుత్వం కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా  చెల్లించలేని పరిస్థితుల్లో ఉంది. అంతటి దారుణమైన సంక్షోభం అక్కడ కొనసాగుతుంది.


 నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉండడంతో కనీసం మూడు పూటలా కూడా తినలేని పరిస్థితి నెలకొంది అని అయితే చెప్పాలి. ఇక పెట్రోల్ ధరలు అయితే సామాన్యుడు వెన్ను లో వణుకు పుట్టిస్తుంది. అక్కడ లీటర్ పెట్రోల్ ధర 320 రూపాయలు ఉండగా.. ఇక డీజిల్ లీటర్ ధర 325 గా కొనసాగుతుంది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఇంధనం నిత్యవసర ధరలు పెంచుతూ ప్రజలపై అక్కడి ప్రభుత్వం పెను భారం మోపుతుంది. ఇటీవల పెట్రోల్ పై లీటర్ కు పది రూపాయలు.. హై స్పీడ్ డీజిల్ పై 16 రూపాయలు పెంచుతున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సామాన్య ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: