ఒక పార్టీ నుంచి రాజ్యసభకు ఒక వ్యక్తి వెళ్తున్నాడు అంటే... చాలా మందిలో ఉండే ఆలోచన... పార్టీ అధినేత బినామీ. దాదాపుగా అదే ఆలోచిస్తారు. లేదు అంటే పార్టీ లో ఎప్పటి నుంచో ఉండాలి. అప్పుడే రాజ్యసభకు వెళ్ళే అవకాశం. లేదా ఆర్ధికంగా బలంగా ఉండాలి. అవును దాదాపుగా ఆర్ధికంగా బలంగా ఉన్న వారినే రాజ్యసభకు పార్టీలు పంపిస్తున్నాయి. ఈ విషయం మేము చెప్పేది కాదు... లెక్కలే చెప్తున్నాయి. తాజాగా నేషనల్ ఎలక్షన్ వాచ్, ఏడీఆర్ అనే ఒక సంస్థ ఈ లెక్కలను వెల్లడించింది. రాజ్యసభలో మొత్తం ఉండే సీట్లు 230... అఫిడవిట్లు సమర్పించిన 229 మంది ఎంపీల ఆస్తులు చూస్తే కోటికి పైగా ఉన్న వారు 89 శాతం మంది ఉన్నారు. 

IHG

అంటే 203 మంది రిచ్ కిడ్స్. రాజ్యసభ సభ్యుల సరాసరి ఆస్తుల విలువ సగటున రూ.62.67 కోట్లుగా ఉంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటీ అంటే... బీజేపీ కంటే కాంగ్రెస్ ఎంపీలే రిచ్. 77 మంది రాజ్యసభ సభ్యులు ఉన్న బిజెపి ఆస్తుల విలువ... ఒక్కొక్కరికి చూస్తే... రూ.27.74 కోట్లు..కాంగ్రెస్ పార్టీ 40 మంది ఎంపీల సరాసరి ఆస్తుల విలువ రూ.38.96 కోట్లుగా ఉందని ఒక సంస్థ వెల్లడించిన లెక్కల్లో స్పష్టమైంది. ఇక తమిళనాడు అధికార పార్టీ  అన్నాడీఎంకే కి ఉన్న రాజ్యసభ 9 మంది ఎంపీల సరాసరి ఆస్తుల విలువ రూ.12.40 కోట్లు. 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MAHENDRA PRASAD' target='_blank' title='mahendra prasad-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>mahendra prasad</a> richest among candidates for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RAJYA SABHA' target='_blank' title='rajya sabha-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>rajya sabha</a> ...

బీహార్ అధికార పార్టీ... జేడీయు రాజ్యసభ ఎంపీ... మహేంద్ర ప్రసాద్ రూ.4078 కోట్లతో అందరి కంటే రిచ్. వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్ళిన ఆళ్ల అయోధ్యరామి రెడ్డి రూ.2577 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక సమాజ్ వాదీ పార్టీ ఎంపీ, అమితాబ్ భార్య జయా బచ్చన్ ఆస్తులు 1001 కోట్లుగా ఉన్నాయి.  54 మందిపై  క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే 24 శాతం మందిపై హత్యానేరం సహా పలు కేసులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: