ఆంధ్రప్రదేశ్ లో సంచలం రేపిన ఘటన ఆలయాల పై జరిగిన దాడులు.. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో జరిగిన ఘటన రాజకీయ చర్చలకు దారితీసింది. ఈ విషయం సీఎం జగన్ కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో విగ్రహాలను ఎత్తుకెళ్లారు.. వాటిలో కొన్ని విగ్రహాల అపహరించిన వారి గురించి పోలీసులు తెలిపారు. అందులో మిస్టరీని తలపించింది అంటే కర్నూల్ లో జరిగిన కాల భైరవ స్వామి విగ్రహ ధ్వంసం ఘటన..గుడిలోంచి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు.ఈ ఘటన పై పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.


తాజాగా సంచలనం రేపిన కాలభైరవ స్వామి విగ్రహ ధ్వంసం కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. ఆ స్వామి వారి విగ్రహాన్ని ఇంట్లోనే పెట్టి పూజలు చేస్తే పిల్లలు పుడతారని చెప్పడంతో ఓ వ్యక్తి ఆ విగ్రహాన్ని గుడి లో నుంచి తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాడు. దీనిపై మండిపడ్డ హిందూ సంఘాల ప్రజలు విగ్రహాన్ని దొంగిలించిన వారిని పట్టుకొని కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం పై దృష్టి సారించిన జిల్లా ఎస్పీ ఫకీరప్ప , పోలీసు బృందాలు లోతుగా విచారణ చేపట్టారు.



గోస్పాడు మండలం వంట వెలగల గ్రామానికి చెందిన సత్తెనపల్లి రాజశేఖర్‌‌ను అదుపులో కి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఎవరో స్వామీజీ చెప్పిన మాటలను పట్టుకొని పిల్లల కోసం ప్రతి అమావాస్య రోజున కాలభైవర స్వామికి ప్రత్యేక పూజలు చేసేవారు. తాళాలు విరగ్గొట్టి, కాలభైరవ స్వామి విగ్రహాన్ని పగులగొట్టి ఇంటికి తీసుకెళ్లి గుట్టుగా పూజలు చేసేవాడు. అతని పూజలు గురించి తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా విగ్రహ ధ్వంసం వెనక ఉన్న అసలు రహస్యం బయటకు వచ్చింది. ఈ ఘటన పై రాజకీయ ప్రమేయం లేదు.. కేవలం మూఢ నమ్మకాలను నమ్మి ఇలా చేశారని ఎస్పీ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: