రఘురామకృష్ణంరాజు ఈ పేరు నిత్యం ఏదో ఒక విధంగా వార్తల్లో కనిపిస్తూనే ఉంటుంది. పబ్లిసిటీ కోసం ఎవరిని పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు గా మాట్లాడుతుంటాడు. సొంత పార్టీ అని చూడకుండా ఎవరినైనా నోటికి వచ్చినట్లు మాట్లాడే దూకుడు ఉన్న వ్యక్తి.  సంచలన కామెంట్లతో నిత్యం వార్తలో ఉండే వ్యక్తి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత, ఎంపీ రఘురామకృష్ణంరాజు.. అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌కు ఆయనపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. అయినా, ఆయన నిత్యం వైసీపీ ఇబ్బంది పెట్టే ఏదో ఓ కామెంట్ చేస్తూనే ఉంటారు.  


రఘురామకృష్ణంరాజు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారనే వార్త హల్ చేసాయి.. అంతేకాదు.. ఆయన ఇంట్లో సీబీఐ సోదాలు జరుగాయని.. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు.. ఇందూ, భారత్ కంపెనీతో సహా ఎనిమిది కంపెనీలకు చెందిన డైరెక్టర్ల ఇళ్లపై దాడులు చేశారని..ఇంకా సోదాలు నిర్వహిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రఘురామకృష్ణంరాజు నివాసాలపై ఏకకాకంలో సీబీఐ దాడులు జరిగినట్టు వార్తలు హల్‌చల్ చేశాయి.. అయితే, ఈ ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు ఎంపీ రఘురామకృష్ణంరాజు.. నా ఇంట్లో ఎలాంటి ఐటీ సోదాలు జరగడంలేదన్న ఆయన.. ఐటీ సోదాలు అన్న వార్త మీడియా ద్వారానే తెలుసుకున్నట్టు వెల్లడించారు.


 హైదరాబాద్‌లో కానీ, ఢిల్లీలో కానీ.. మా ఇంట్లో ఎలాంటి సోదాలు జరగలేదు.. అందుకు సంబంధించిన సమాచారం మాకు ఎవరు ఇంతవరకు ఇవ్వలేదన్నారు. కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నా రఘురామకృష్ణంరాజు... రూ.826 కోట్ల రుణాలను ఆయన కంపెనీలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. ఇందూ పవర్ ప్రాజెక్టు పేరుతో రుణాలు తీసుకున్నట్టుగా సమాచారం. ఈ కేసులో రంగంలోకి దిగిన సీబీఐ.. దేశవ్యాప్తంగా ఏకకాలంలో 11 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్టుగా చెబుతున్నారు..  హైదరాబాద్, ముంబై, కర్ణాటక, సికింద్రాబాద్, ఢిల్లీల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.. దీనికి కారణం సొంత పార్టీ నేతలతో వైరమే. స్టాండింగ్ కమిటీలో పదవి ఇవ్వనందుకు ముఖ్య నేతలను కులం పేరుతో దూషించడంతో వారి ఆగ్రహానికి గురయ్యాడని వార్తలు షికార్లు చేస్తున్నాయి. సీబీఐ సోదాలు జరగడానికి ఇదే కారణం అంటున్నారు. అసలు విషయం పై స్పష్టత రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: