తెలంగాణలో ఇప్పుడు ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరించకపోతే కాంగ్రెస్ పార్టీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి కూడా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారు ఏంటి అనేది స్పష్టత రావడం లేదు. ముఖ్యమంత్రి అభ్యర్థి, రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఒక తప్పు మీద తప్పు చేస్తూ ముందుకు వెళుతుంది.

దీని వలన సమస్యలు పెరగటం... కార్యకర్తల పార్టీకి దూరం కావడం జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంత త్వరగా ఏకాభిప్రాయానికి వస్తే అంత మంచిదనే అభిప్రాయం చాలా వరకు కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది అగ్రనేతలు ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి పదవి కోసం ఆశ పడుతున్నారు అని ప్రచారం మొదలైంది. ప్రధానంగా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారి మధ్య ముఖ్యమంత్రి పదవి విషయంలో ఇప్పుడు పోటీ ఉందని టాక్.

ఇటీవల వీరిద్దరు జానారెడ్డికి మద్దతు ఇచ్చినా సరే జానారెడ్డి మాత్రం తాను రాజకీయాల్లో ఉన్నా పోటీ చేయను అని స్పష్టంగా  చెప్పడంతో ఏం జరగబోతుంది ఏంటి అనేది ఆసక్తిని రేపుతోన్న అంశంగా ఉంది. జానా రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుకూలంగా ఉన్న సమయంలో ఆయన సైలెంట్ కావడం వెనుక అర్థం ఏంటి అనేది తెలియడం లేదు. అయితే జానా రెడ్డి వ్యూహం ఏంటి అనేది అర్థం కాక కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి పదవికి సంబంధించి మాత్రమే ఇప్పుడు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్యే ప్రధానంగా పోటీ ఉంది అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: