ఇటీవలే కాశ్మీర్లో జరిగిన డ్రోన్ బాంబు దాడి దేశవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. సాధారణంగానే కాశ్మీర్ భూభాగంలో ఎప్పుడు ఉగ్రవాదులు ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో భారత ఆర్మీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఉగ్రవాదుల కుట్రలకు  ఎక్కడికక్కడ చెక్ పెడుతుంది.  ఇలాంటి నేపథ్యంలో ఇటీవల జరిగిన డ్రోన్ దాడి మాత్రం సంచలనంగా మారిపోయింది. జమ్ము ఎయిర్ బేస్ పై జరిగిన ఈ దాడి భద్రతా దళాలను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నడూ కూడా భారత్లో డ్రోన్ దాడులు జరగలేదు



 ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఉన్న యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు లక్ష్యంగా ఇక ఈ దాడి జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు  దాదాపు కేజీన్నర బరువున్న ఎల్ఇడి బల్బులు డ్రోన్ లకు కట్టి ఏయిర్ ఫోర్స్ స్టేషన్ లో జారవిడిచినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ సరిహద్దుకు  14 మీటర్ల దూరంలోనే జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంటుంది.  ఈ క్రమంలోనే అప్రమత్తమైన భారత దళాలు డ్రోన్ దాడి వెనుక ఉన్న కుట్ర గురించి తెలుసుకునే పనిలో పడ్డారు. అయితే ఇక ఇటీవల  దాడిలో ఏకంగా రెండు డ్రోన్ వాడబడ్డాయి అని సైన్యం గుర్తించింది. ఇప్పటికే కేంద్రం ఆర్టికల్ 370 రద్దు చేయడం ఇక ఇప్పుడు అఖిలపక్షం ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవడం తో  ఉగ్రవాదులు ఈ కుట్రకు పాల్పడిన తెలుస్తోంది.



 ఈ క్రమంలోనే ఇక కాశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి ఎన్నికలు జరగకుండా చేయాలని పాకిస్తాన్ ఇలాంటి కుట్రలకు పన్నుతున్నట్లు ప్రస్తుతం కేంద్రం భావిస్తోందట. ఈ క్రమంలోనే మరోసారి కాశ్మీర్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. అయితే తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఈ రెండు డ్రోన్  దాడులు చేసినట్లు తెలుస్తుంది. సాధారణంగా అయితే డ్రోన్లతో దాడి చేయారు. కానీ డ్రోన్లతో డాడీ అంటే యుద్ధం లాంటిదే. దీని పై విచారణ కొనసాగుతుంది. పాకిస్తాన్ డ్రోన్ లను ఉపయోగించింది అని విచారణలో అధికారికంగా తేలితే ఊహించని విధంగా పాకిస్థాన్కు సరైన బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధంగా ఉంది అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారూ.

మరింత సమాచారం తెలుసుకోండి: