గుంటూరు అర్బన్ ఎస్పీని కలసిన టీడీపీ నేతల బృందం మీడియాతో మాట్లాడింది. బుద్దా వెంకన్న మాట్లాడుతూ... 17న మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై వైసీపీ గుండాలు దాడి చేస్తుంటే మేము అడ్డుకున్నాం అని అన్నారు. అడ్డుకున్న సమయంలో వైసీపీ నేతలు చంద్రబాబుని చంపేస్తాని హెచ్చరించారు అని ఆయన పేర్కొన్నారు. మాకు డీజీపీ అండ ఉందని బెదిరించారు అని వెల్లడించారు. ఆ రోజు జరిగిన సంఘటనపై తాడేపల్లి స్టేషన్ లో ఫిర్యాదు చేశాం అన్నారు ఆయన. తమ ఫిర్యాదుకు సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోలేదు అన్నారు.

దాడి చేసిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో పోలీసులు ఉన్నారు అని ఆయన విమర్శించారు. పోలీసు ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందిని వత్తిడికి గురి చేస్తున్నారు అని మండిపడ్డారు. ఆ రోజు ఘటనకు సంబంధించి చర్య తీసుకోకపోతే మేము న్యాయస్థానానికి వెళతాం అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ నేత పట్టాబి మాట్లాడుతూ... దాదాపు 80మందికి పైగా వైసీపీ గుండాలు చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లారు అని అన్నారు. సమాచారం తెలిసినా జోగి రమేష్ ని అడ్డుకోకుండా రాచ మర్యాదలతో జోగికి స్వాగతం పలికారు అని ఆయన ఆరోపించారు.

దాదాపు గంటకు పైగా అక్కడ యుద్ద వాతావరణం ఉన్న అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేయలేదు అని మండిపడ్డారు. ఆ రోజు మా మీద జరిగిన దాడికి సంబంధించి మేము ఇచ్చిన పిర్యాదుపై ఇప్పటి వరకు చర్యలు లేవు అని ఆయన విమర్శించారు. తిరిగి మా మీదే కేసులు పెట్టారు అన్నారు. రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్లు లేవు వైసీపీ సెక్షన్లు అమలులో ఉన్నాయి అని ఆయన ఆరోపించారు. తాడేపల్లి స్టేషన్ లో ఇచ్చిన కంప్లైంట్ పై చర్యలు తీసుకోలేదు కాబట్టి ఎస్పీని సంప్రదించాం అని అన్నారు. ఎస్పీ చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానంకి వెళతాం అని ఆయన వెల్లడించారు. హైకోర్టు మెట్లు ఎక్కడం డీజీపీ కి అలవాటు అయింది అని నింధితులపై చర్యలు తీసుకోకపోతే డీజీపీ, డీఐజీ, ఎస్పీ అందరూ కోర్టుకు హజరు అవుతారు అని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: