భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ జమ్మూకాశ్మీర్ పై తన వైఖరిని స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే మొదటి దఫా గెలుపు తరువాత చేయకపోయినప్పటికీ రెండో దఫాలో ఆ రాష్ట్రంపై స్పష్టత ఇచ్చింది. దీనిప్రకారం అక్కడ ప్రధాన ఉగ్ర చొరబాట్లు ఉన్న ప్రాంతాన్ని కేంద్రం తన ఆదీనంలో పెట్టుకోగా మిగిలిన దానిని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించింది. అప్పటి నుండి కాశ్మీర్ కేంద్రం ఆదీనంలో ఉంది. దీనివలన కేంద్ర బలగాలు కాశ్మీర్ మొత్తాన్ని జల్లెడ పడుతూ ఉగ్రవాదులను ఎప్పటికప్పుడు ఏరిపారేస్తున్నారు. ఈ ప్రక్రియ ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో తెలియదు కానీ అక్కడ ప్రజలు మాత్రం అనుక్షణం భయబ్రాంతులలో కొట్టుమిట్టాడుతూ బ్రతకాల్సి వస్తుంది.

ఈ ప్రాంతంలో పాక్ ప్రభావిత ఉగ్రవాదం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ చొరబాట్లు ఇప్పటికి భారీగా జరిగి ఉండటం, వాళ్ళు ప్రాంతీయ యువతను వారివైపు మళ్ళించుకోవడం వలన వాళ్ళ సైన్యం  కూడా బాగానే ఉండి ఉంటుంది. దీని వలన ఎవరు ప్రజలు, ఎవరు ఉగ్రవాది అనేది స్పష్టంగా కనిపెట్టడం కాస్త కష్టంగానే ఉంటుంది. దీనివలన అక్కడ ఇంకా శాంతి నెలకొనలేదని తెలుస్తుంది. అక్కడ ప్రాంత ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరిస్తే ఈ పని ఇంకా సులభం అవుతుంది. ఒకవేళ ఈ ప్రభుత్వం మారిపోతే అనే ఆలోచన  అక్కడి వారు అలా సాయం చేయడానికి వెనుకాడటానికి కారణం కావచ్చు.  

ఈ ప్రభుత్వం మారిపోతే అనంతరం వచ్చే వాళ్ళు ఏవిధంగా కాశ్మీర్ విషయాన్ని తీసుకుంటారో తెలియదు. ఈ నేపథ్యంలో స్థానికుల సాయం కూడా అందడం కష్టం. దీనితో అక్కడ కేంద్రం బలగాలతోనే ఉగ్ర మూకలను అణిచేందుకు యత్నిస్తుంది. ఈ విధానం కంటే మెరుగైనది కూడా ప్రభుత్వం ఆలోచిస్తూనే ఉంటుంది. అయినా అప్పటిదాకా ఇక్కడ తుపాకులు పేలుతూనే ఉంటాయి. తాజాగా మరో ఉగ్రదాడిలో ముగ్గురు పౌరులు సహా పలువురు గాయపడ్డారు. వేర్వేరు చోట్ల ఈ దాడులు జరిగినట్టు అధికారులు తెలిపారు. అందులో ముగ్గురు పౌరులు, ఒక ఫార్మసీ యజమాని(మఖాన్ లాల్, పండిట్), ఒక వీధి వ్యాపారి ఉన్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: