ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విషయంలో ఇప్పుడు వైసీపీ చాలా సీరియస్ గా ఉంది. సీఎం జగన్ పై చేసిన విమర్శల విషయంలో వైసీపీ నాయకులు కాస్త ఇబ్బంది పడుతూ టీడీపీ అనే పార్టీనే లేకుండా చేయాలని డిమాండ్ చేయడం మనం చూస్తున్నాం. ఇక ఇది పక్కన పెడితే సీఎం వైఎస్ జగన్ పై దుర్భాషలాడారంటు టీడీపీ పై గవర్నర్ కు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి  రాయడం సంచలనం చేసారు. చంద్రబాబుని రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పించాలని సంతకాలతో ఫిర్యాదు చేసారు ఆనం రామనారాయణ రెడ్డి.

జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ని కలిసి గవర్నర్ కు రాసిన లేఖను ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, అనుచర ప్రజాప్రతినిధులు అందించారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రినే టీడీపీ అధికారప్రతినిధి పట్టాభి పదేపదే ఐదు ఆరు సార్లు అదే బూతుని ఉచ్చరించాడు అని ఆయన విమర్శించారు. చంద్రబాబు ఆదేశాల మేరకే పట్టాభి ఉద్దేశపూర్వకంగానే మాట్లాడాడు అని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించటం నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదు అని అన్నారు ఆనం రామనారాయణ రెడ్డి.

సభ్యసమాజం చంద్రబాబు వైఖరిని తప్పు పడుతోంది  అని ఆయన వ్యాఖ్యలు చేసారు. రాజకీయ మనుగడ కోసం దిగజారి వ్యవహరించటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. 36 గంటల పాటు చంద్రబాబు ఎందుకు చేసారో చెప్పాలి  అని ఆనం రామనారాయణ రెడ్డి నిలదీశారు. ఆర్టికల్ 356 ప్రకారం ప్రభుత్వాన్ని రద్దుచేయాలనటం హాస్యాస్పదం అని అన్నారు. రాజ్యాంగం లో ఏమి ఉందొ కూడా తెలుసుకోకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. చంద్రబాబు తప్పు తెలుసుకోకపోతే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతాడు అని అన్నారు. ప్రజాతీర్పుని గౌరవించకుండా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారు అని మండిపడ్డారు. జనాగ్రహ దీక్షలో టీడీపీ తీరుకి నిరసనగా గవర్నర్ కి లేఖ కోసం సంతకాలు సేకరించాము అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap