ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని మాత్రమే ఉంచాలంటూ... సేవ్ అమరావతి పేరుతో న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ మహా పాదయాత్ర చేపట్టారు అమరావతి ప్రాంత రైతులు. ఈ యాత్ర ఇప్పటికే ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే శ్రీకాళహస్తీశ్వరుడుని దర్శించుకున్న రైతులు... మరో రెండు, మూడు రోజుల్లో తిరుమల చేరుకోనున్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జవహర్ రెడ్డికి ప్రత్యేక లేఖ కూడ రాశారు. ఎలాంటి నినాదాలు చేయమని... కొవిడ్ నిబంధనలు పాటిస్తామని కూడా లేఖలో హామీ ఇచ్చారు అమరావతి రైతుల జేఏసీ నేతలు. అలాగే ముగింపు సందర్భంగా తిరుపతి పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కూడా రైతులు ముందే ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించి అనుమతి ఇవ్వాలని తిరుపతి పోలీసులను విజ్ఞప్తి కూడా చేశారు. కానీ ఇక్కడే రైతులకు ఎదురు దెబ్బ తగిలింది. కేవలం పాదయాత్రకు మాత్రమే హైకోర్టు అనుమతి ఇచ్చిందని... సభలకు ఎలాంటి అనుమతి లేదని తేల్చాశారు పోలీసులు.

ఈ నెల 17వ తేదీన సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న రైతులు... పోలీసు ఆంక్షలు విధించడంతో... చేసేది లేక మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే అమరావతి ప్రాంత రైతుల తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం... రైతులకు హైకోర్టులో కూడా ఎదురు దెబ్బ తగిలేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎలాగైన సభ నిర్వహించేందుకు ఇప్పటికే అమరావతి రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ పోలీసులు మాత్రం అనుమతి ఇచ్చేది లేదని స్పష్ట చేశారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టిన రైతులు... మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. పాదయాత్ర విషయంలో ప్రభుత్వంపై రైతులు పై చెయ్యి సాధించడంతో... తీవ్ర ఆగ్రహంతో ఉంది వైసీపీ సర్కార్. ఎలాగైనా అడ్డుకునేందుకు ఇప్పటికే అస్త్రాలు సిద్ధం చేస్తోంది. పాదయాత్రలో నిబంధనలకు విరుద్ధంగా వేల మంది పాల్గొన్నారని, అన్నికంటే ముఖ్యంగా ప్రస్తుతం కరోనా ఓమిక్రాన్ వేరియంట్ వైరస్ ప్రభలుతోందనే విషయాన్ని కూడా హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో సభ జరుగుతుందా లేదా అనే విషయం హైకోర్టులో వచ్చే తీర్పుపైన ఆధారపడి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: