ఆసియా ఖండానికే తల మానికంగా పేర్కోనే చర్చి  తెలుగు రాష్ట్రాలలో ఉంది. వాస్తవానికి తెలుగు రాష్ట్రాలలో పురాతన చర్చలకు కొదువ లేదు. వాటి చారిత్రక విశేషాలపై మనం  ఓ లుక్ వేస్త ఎన్నో విషయాలు బోధపడతాయి. అలాంటి కోవలోకే వస్తుంది మెదక్ లోని పురాతన చర్చి ఎన్నో చారిత్రక విశేషాలను ప్రపంచానికి చాటి చెప్పే వారసత్వ సంపద మెదక్ చర్చి.  నిత్యం ఈ చర్చిని సందర్శించేందుకు వేలాది మంది వస్తుంటారు.  అక్కడి ప్రార్థనల్లో పాల్గోంటుంటారు. అదే సమయంలో  కరువు కాలంలో ఇక్కడి జనాల్ని ఆదుకున్న కరుణామయుడి కూడా తులుచుకుంటుంచారు. స్థానికులు, చరిత్ర కారుల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
మెదక్ జిల్లా ప్రజల జీవనాధారం వ్యవసాయమే. ఇక్కడ ఎలాంటి కుటీర పరిశ్రమలూ లేవు.  పెద్ద పెద్ద డ్యాం లు అసలే లేవు. ఉన్న కొద్ది పాటి చెఱువులే  సాగునీటి, తాగునీటి అవసరాలు తీర్చేవి. ఎక్కవ భాగం వర్షాధారమే. ఇదంతా మొదటి ప్రపంచ యుద్దం నాటి ముచ్చట. ఆ యుద్దం ముగిశాక.. అది ప్రధాన కారణం కాదు...మెదక్ సీమ పై కరువు కరాళ నృత్యం చేసింది.  దాదాపు ఆరేడేళ్లపాటు కరువు వచ్చిందని  చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. రైతులు వలసలు పోయేందుకు కూడా వసతులులేని రోజులవి. ఉన్న కొద్ది పాటు పశువులు కూడా తిండి, నీరు లేక ఎక్కడివక్కడ చనిపోయేవని చరిత్ర చెబుతోంది.

దేశంలో తెల్లదొరల పరిపాలన సాగుతున్న కాలం. ఆ సమయంలో ఇంగ్లాండ్ దేశానికి చెందిన క్రైస్తవ  మత ప్రసంగీకుడు చార్లెస్ వాకర్ పాస్నెట్ 1895లో ఇండియాకు విచ్చేశాడు.  తోలుత ఆయన చెన్నై  పరిసర ప్రాంతాలలో  క్రిస్టియానిటీని పెంపొందించేందుకు కృషి చేసిన ఆయన తరువాతి కాలంలో  హైదరాబాద్ కు వచ్చారు. అక్కడ నుంచి 1987లో మెదక్ పట్టణానికి వచ్చారు. వాకర్ పాస్నెట్  కేవలం మత ప్రచారంతో సరిపెట్టుకో లేదు. అక్కడి ప్రజల ఆకలి కేకలను విన్నారు. తన మిత్రుడు  బ్రాడ్ షా తో చర్చించారు. వారి ఆకలిదప్పులు తీర్చేందుకు  ధన సాయం చేయడం కన్నా ఉపాధి కల్పిస్తే బాగుంటుందని పాస్నెట్ తలంచారు.  ఆయన ఆలోచనలకు ఆయన మిత్రులైన కొందరు తెల్ల దొరలు, స్థానిక భూ స్వాములు మద్దతుత పలికారు. దీంతో ఈ చర్చి నిర్మాణం జరిగింది. దాదాపు పదివేల మంది కార్మికులకు  చర్చి నిర్మాణం ఉపాధి కల్పించింది. పదేళ్లపాటు ఈ చర్చి నిర్మాణం జరిగిందని చరిత్ర కారులు పేర్కోంటున్నారు. స్థానికులు ఈ ప్రాంత కరుణామయుడుగా  చార్లెస్ వాకర్ పాస్నెట్ కొనియాడుతున్నారు.  ఈ చర్చిలో ఎన్నో...ఎన్నెన్నో విశేషాలున్నాయి. ఇవి మాటలకందనివి. నేరుగా చూస్తే  మంత్రముగ్దులవడం ఖాయం.




మరింత సమాచారం తెలుసుకోండి: