గత కొద్దిరోజులుగా ప్రభుత్వానికి మరియు ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ రసాభాష జరుగుతున్న విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం చేస్తోందని రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. అంతే కాకుండా రాష్ట్రానికి సీఎం అని కూడా చూడకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తూ ఉండే జగన్ ఏమీ అనకపోయినా, ఇప్పుడు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులపై ఈ రోజు మీడియా సమావేశంలో ఒక రేంజ్ లో రెచ్చిపోయారు.

ఉపాధ్యాయులను లక్ష్యంగా చేసుకుని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు జీతాలు కోసం రోడ్డెక్కిన ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించకుండా, ప్రైవేట్ పాఠశాలల్లో ఎందుకు చదివిస్తున్నారని సూటిగా అడిగారు. భవిష్యత్తుకు అవసరం అయ్యే పౌరులను తీర్చి దిద్దే వృత్తిలో ఉన్న టీచర్లు ఈ విధంగా మాట్లాడడం సరికాదని వారి తీరును దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎవరికి సమస్య వచ్చినా తీర్చే నైతిక బాధ్యత సీఎం పై ఉందన్నారు. అలాంటిది సీఎం తో కలిసి మాట్లాడుకుని పరిష్కరించుకోకుండా రోడ్లెక్కి నిరసనలు చేయడం తగదన్నారు. ప్రభుత్వమే చర్చలకు పిలిచినా ఉపాధ్యాయ సంఘాలు ససేమిరా అనడం దేనికి నిదర్శనమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఈ నెల మొదటి వారంలో జరిగిన చర్చలో భాగంగా సీఎం పీఆర్సీ తో పాటుగా ఇప్పటికే పెండింగ్ లో ఉన్న 5 డి ఏ లను సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అయితే ఉద్యోగులు ఆ తర్వాత డి ఏ ల విషయంలో సంతృప్తి పడినా ఫిట్ మెంట్ ఇంకా పెంచాలని గొడవ చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడారు. ఇది ఇలా కొనసాగుతూ ఉంది. ఎప్పటికి ఈ సమస్య తీరుతుందో తెలియని పరిస్థితి. అయితే దీనిని బట్టి సామాన్యులకు తెలుస్తోంది ఏమిటంటే ఉద్యోగులు కోరిన విధంగా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా  లేదు. కేవలం వారిని చర్చలకు పిలిచి బుజ్జగించడానికి చూస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: