టిడిపి నేత కోన వెంకట్ రావు ఆత్మహత్యకు పాల్పడటం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సంచలనం గా మారి పోయింది. అయితే కోన వెంకట్ రావు ఆత్మహత్యకు పాల్పడటం పై అటు వైసీపీ వేధింపులే కారణమని టిడిపి నేతలు అందరూ కూడా తీవ్ర స్థాయి లో విమర్శలతో విరుచుకు పడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఇదే విషయం  పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు.


 జగన్ ప్రభుత్వ హయాం లో సోషల్ మీడియా లో పోస్టులు పెట్టడం నేరం గా మారి పోయింది అంటూ నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్తపల్లి గ్రామం టిడిపి కార్యకర్త కోన వెంకట్ రావు ను వేధించి బలవన్మరణాలకు పాల్పడేలా వైసీపీ చేసిందని ఇక ఈ దుర్మార్గాన్ని తీవ్రం గా ఖండిస్తున్నాము అంటూ చెప్పుకొచ్చాడు. ఏపీ లో ఉన్నది పోలీసులా లేక వైసిపి రౌడీషీటర్లకు అనుచరుల అన్నది కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి అంటూ నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.


 ప్రభుత్వ వైఫల్యాలు వైసిపి అవినీతి అక్రమాలపై సోషల్ మీడియా లో పోస్టులు పెట్టడం కూడా తప్పేనా అంటూ ప్రశ్నించారు లోకేష్. ఇక ఇలా వైసీపీ అక్రమాలు నిలదీస్తూ పోస్టులు పెట్టిన ప్రతి ఒక్కరిని చంపుకుంటూ పోతే ఇక ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ నేతలు పోలీసులు మాత్రమే మిగులుతారు ఇంకెవరు మిగలరు అంటూ వ్యాఖ్యానించాడు. ఇక కోన వెంకట రావు మృతికి కారణమైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, బాధ్యులైన పోలీసుల పై కేసు నమోదు చేసి అరెస్టు డిమాండ్ చేశారు నారా లోకేష్. ఇక బాధిత కుటుంబానికి తెలుగు దేశం పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు..

మరింత సమాచారం తెలుసుకోండి: