ఇప్పటికే అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తుంది..మరో రెండు నెలల్లో అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయిపోతాయి..కాబట్టి ఇకనుంచి ఎమ్మెల్యేలంతా జనాల్లోకి వెళ్ళాలి...డోర్ టూ డోర్ వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి..వాటిని పరిష్కరించడానికి కృషి చేయాలని చెప్పి ఇటీవల సీఎం జగన్..వైసీపీ ఎమ్మెల్యేలకు సూచించిన విషయం తెలిసిందే. అయితే ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సర్వే బట్టే ఎమ్మెల్యేలని ప్రజల్లోకి వెళ్ళమని జగన్ చెప్పినట్లు కనిపిస్తోంది.

ఎందుకంటే అధికారంలోకి వచ్చాక ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ప్రజల్లో లేరు...ప్రజల సమస్యలని పట్టించుకోలేదు..దీంతో చాలామంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరిగింది..దీని వల్ల జగన్‌కు మైనస్ అయ్యే పరిస్తితి వచ్చింది..ఇదే అంశం పీకే సర్వేలో తేలిందని తెలిసింది..దీంతో ఎమ్మెల్యేలని ప్రజల్లోకి వెళ్ళేలా జగన్ ప్లాన్ చేశారు.  ఇదే సమయంలో పీకే టీం ఇచ్చిన సర్వే ప్రకారం...కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ సీటు ఇవ్వడం కష్టమని తెలిసింది..మరొకసారి వారిని సీట్లు ఇస్తే ఓడిపోవడం గ్యారెంటీ అని తెలిసింది.


అందుకే కొంతమందికి సీట్లు ఇవ్వడానికి జగన్ నిరాకరించేలా ఉన్నారు..అయితే ఇప్పుడు ప్రజల్లోకి వెళుతున్నారు కాబట్టి, ఈలోపు ఏమైనా మార్పు వస్తే సీటు ఉంచొచ్చు..లేదంటే నిర్మొహమాటం లేకుండా సీటు ఇవ్వరని అర్ధమవుతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఎదురుకుంటున్న ఎమ్మెల్యేలు వచ్చి...ఎస్సీ, బీసీ ఎమ్మెల్యేలని తెలుస్తోంది. మెజారిటీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తుందని సమాచారం. అందులో కొంతమందికి మాత్రం సీటు ఇవ్వకూడదని జగన్ ఫిక్స్ అయిపోయారని సమాచారం.

అయితే ఇక్కడ ప్రజా వ్యతిరేకత తక్కువ ఉన్న ఎమ్మెల్యేలు వచ్చి రెడ్డి వర్గం ఎమ్మెల్యేలని తెలుస్తోంది...వీరందరికి మళ్ళీ సీట్లు గ్యారెంటీ అని అర్ధమవుతుంది. ఏ ఒక్కరికీ కూడా సీటు పోయే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఏదో ఒకరిద్దరు మినహా...మిగిలిన రెడ్డి ఎమ్మెల్యేలకు సీట్లు ఫిక్స్ అని సమాచారం..ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలకు సీట్ల విషయంలో ఎలాంటి డౌట్లు లేవని సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: