రానురాను జగన్మోహన్ రెడ్డి మీద గుడ్డి వ్యతిరేకతతో ఎల్లోమీడియా ఏమి రాస్తోందో ఎవరికీ అర్ధం కావటంలేదు. ‘రాజశేఖరరెడ్డి కుటుంబానికి వైసీపీతో ఉన్న అనుబంధం శుక్రవారంతో తెగిపోయింది.’ రాజశేఖరరెడ్డి భార్య విజయమ్మకు, గారాలపట్టి షర్మిలకు వైసీపీతో ఇపుడు ఎటువంటి సంబంధంలేదట. వైసీపీ ఇపుడు పూర్తిగా జగన్ సొంతమట. అసలు ఈ రాతల్లో ఏమన్నా అర్ధముందా ? ఏదో రాయలికాబట్టి జగన్ కు వ్యతిరేకంగా రాయటం, వైఎస్సార్ కుటుంబంపై విషం చిమ్మాలన్న ఏకైక టార్గెట్ తో విషం చిమ్మటం మాత్రమే కనబడుతోంది.




రాజశేఖరరెడ్డి కుటుంబంతో వైసీపీకి అనుబంధం తెగిపోయిందట. వైఎస్సార్ కుటుంబంలో జగన్ లేరా ? వైఎస్సార్ కుటుంబం అంటే కేవలం విజయమ్మ, షర్మిల మాత్రమేనా ?  రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మ, కూతురు షర్మిలకు వైసీపీతో ఇపుడు ఎలాంటి సంబంధంలేదని అచ్చేశారు. విజయమ్మ, షర్మిలకు వైసీపీతో ఎప్పుడూ సంబంధంలేదు. ఎందుకంటే వైసీపీ పెట్టింది జగనే కానీ విజయమ్మో లేకపోతే షర్మిలో కాదన్న విషయం అందరికీ తెలిసిందే.





వైసీపీ ఇపుడు పూర్తిగా జగన్ సొంతమట. పార్టీ పెట్టిందే జగన్ అయినపుడు పార్టీ ఇపుడు జగన్ సొంతమవ్వటం ఏమిటి ? పార్టీపెట్టిన తర్వాత తల్లికాబట్టి విజయమ్మను జగన్ గౌరవాధ్యక్షురాలిగా నియమించారంతే. గౌరవాధ్యక్షురాలంటే వైసీపీ విజయమ్మ సొంతమైపోతుందా ? ఏమిటో మతిలేని రాతలు రాసేసి బ్రహ్మాండంగా రాశామని చెప్పుకుంటే ఎవరు ఏమీ చేయలేరు. కూతురు తెలంగాణా పార్టీ పెట్టుకున్నారు కాబట్టి ఆమెకు తన మద్దతు అవసరమని భావించి తాను గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పటంలో లాజిక్ ఉందికదా. ఇందులో ఎల్లోమీడియాకు వచ్చిన బాధేమిటి ?






ఇక్కడే జగన్-చంద్రబాబునాయుడు మధ్య పోలికలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎన్టీయార్ టీడీపీని స్ధాపించి  కష్టపడి ప్రచారంచేసి అధికారంలోకి తీసుకొస్తే వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నది చంద్రబాబు. తండ్రిపెట్టిన పార్టీని సంతానంలో ఎవరికీ కాకుండా మోసంచేసి లాగేసుకున్నది చంద్రబాబు. ముందు తోడల్లుడు, తర్వాత కొడుకులను మోసంచేసి చంద్రబాబు పార్టీని లాగేసుకుంటే ఎల్లోమీడియాకు తప్పుగా అనిపించలేదు. ఏదోవిదంగా బురదచల్లేయటమే టార్గెట్ గా పెట్టుకుని రాసే రాతలు ఇలాగే మతిలేని రాతల్లాగే  ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: