మోకాలికి బోడిగుండికి ముడిపెట్టడం  తెలుగుదేశంపార్టీ నేతలకు బాగా అలవాటు. దేశంలో నెగిటివ్ గా ఎక్కడేమి జరిగినా వెంటనే దాన్ని తీసుకొచ్చి వైసీపీకి లేదా డైరెక్టుగా జగన్మోహన్ రెడ్డికి ఆపాదించేయటం తమ్ముళ్ళకు బాగా అలవాటైపోయింది. తమ్ముళ్ళ పరిస్ధితి ఎలాగైపోయిందంటే కోతికి కొబ్బరికాయ దొరికినట్లుగా అయిపోయింది. తాజాగా హైదరాబాద్ లో చికోటి ప్రవీణ్ అనే వ్యక్తిని ఈడీ అధికారులు పట్టుకున్నారు.

ఇతను నేపాల్, శ్రీలంక, ఇండోనేషియా దేశాల్లో జరిగే క్యాసినోలకు తెలుగురాష్ట్రాల నుండి జనాలను తీసుకెళతాడట. పై దేశాల్లో క్యాసినోలు ఆడటం నేరమేమీకాదు. పై దేశాల్లో క్యాసినోల్లో పార్టిసిపేట్ చేయదలచుకున్నవారు హ్యాపీగా వెళ్ళొస్తారు. ఎందుకంటే అదేమీ తప్పుకాదు కాబట్టి.  అలా వెళ్ళేవారిలో కొందరు చికోటి ద్వారా వెళ్ళారట. ఇపడీ విషయాలు ఛానళ్ళల్లో బయటకు రాగానే వెంటన దాన్ని వైసీపీకి ముడిపెట్టేశారు. నేపాల్ కు వెళ్ళి క్యాసినోలు ఆడినవారిలో సగంమంది వైసీపీ నేతలే ఉన్నారని సీనియర్ నేత వర్లరామయ్య ఆరోపణలు మొదలుపెట్టేశారు.


వర్లతోనే ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేయిస్తున్నదంటే ఈయన ఎస్సీ కాబట్టి. గుడివాడలో క్యాసినో జరిగినపుడు మాజీమంత్రి కొడాలినాని, ఎంఎల్ఏ వల్లభనేని వంశీలు వందల కోట్ల రూపాయలు సంపాదించారన్నట్లుగా ఆరోపణలు చేశారు. నేపాల్  క్యాసినోకి వెళ్ళిన ప్యాసెంజర్ల లిస్టు బయటపెట్టే ధ్యరైముందా అంటు సవాలొకటి. విమానాల్లో వెళ్ళిన వాళ్ళజాబితా బయటపెట్టాల్సింది కేంద్రప్రభుత్వమే కదా. విమానయానశాఖ కేంద్రప్రభుత్వం చేతిలో ఉంటుందని ఈయనకు తెలీదా ?  కేంద్రాన్ని అడిగే ధైర్యంలేదు కాబట్టే జగన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడేస్తుంటారంతే.


వైసీపీ నేతల  ఇళ్ళలో కూడా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు జరపాలని డిమాండ్ కూడా చేసేశారు. గుడివాడలో క్యాసినో నడిపినపుడు ఎట్రీ ఫీజు రూపంలో నాని, వంశీలు రు. 180 కోట్లు వసూలుచేశారట.  క్యాసినో ద్వారా కొడాలి, వంశీ ఏం వ్యాపారాలు చేస్తున్నారో తొందరలోనే బయటపెడతానని బెదిరింపొకటి. నిజంగానే వాళ్ళు చట్టవ్యతిరేక వ్యాపారాలు చేస్తుంటే, ఆ వివరాలు వర్ల దగ్గరుంటే వెంటనే బయటపెట్టచ్చు కదా మళ్ళీ ముహూర్తం దేనికి. 

మరింత సమాచారం తెలుసుకోండి: