పిల్లలను కనాలని అందరికి ఉంటుంది..కేవలం ఆ ప్లానింగ్ వుంటే సరిపోదు..వారిని కనాలనుకోవడానికి ముందు వారి భవిష్యత్తు గురించి కూడా ఆలోచించడం చాలా ముఖ్యం.. పిల్లల చదువుల నుంచి పెళ్ళి వరకూ అన్నీ అన్నీ చూడాలి..అలా ఆలోచించేవారికి కొన్ని బెస్ట్ స్కీమ్ ఉన్నాయి. అందులో ప్రభుత్వం సంస్థ ఎల్ఐసీ లో ఎన్నో బెస్ట్ పథకాలు ఉన్నాయి. వాటిలో మీ డబ్బులను ఇన్వెస్ట్ చెయ్యడం వల్ల సెక్యుర్ అండ్ సేఫ్ అనే చెప్పాలి.. ఇప్పుడు ఒక బెస్ట్ స్కీమ్ ను అందుబాటులోకి తీసుకోని వచ్చింది.. ఎల్‌ఐసీ కన్యాదాన్‌ పాలసీని తీసుకొచ్చిన ఈ పథకంతో కూతురు పెళ్లి కోసం డబ్బును ఇన్వెస్ట్ చేసుకోవచ్చు..ఇక ఆలస్యం ఎందుకు ఈ స్కీమ్ గురించి పూర్తీ వివరాలను తెలుసుకుందాం...


ఈ స్కీమ్ లో మీ కూతురు పుట్టిన తరువాత ప్లాను చేసుకోవడం మంచిది..22 ఏళ్ళ పాటు డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే 26 లక్షలు మీ సొంతం..22 ఏళ్లపాటు ప్రతి నెల రూ. 3600 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా కనీసం 25 ఏళ్ల పాటు చెల్లిస్తే తర్వాత రూ. 26 లక్షలు పొందొచ్చు. నెలవారీ ప్రీమియంను తక్కువగా ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఇందులో ఉంది. ఈ స్కీమ్ లో తీసుకున్న మూడేళ్ల తర్వాత రుణం కూడా పొందొచ్చు. దీంతో పాటు ప్రీమియం డిపాజిట్‌పై 80C కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. సెక్షన్ 10D కింద మెచ్యూరిటీ మొత్తం పన్ను లేకుండా పొందవచ్చు..కాగా, అష్యూర్డ్ పరిమితి కనిష్టంగా రూ.1 లక్ష నుంచి ప్రారంభమవుతుంది గరిష్ట పరిమితి ఉండదు..మీ ఇష్టం అది..


ఈ స్కీమ్ లైఫ్ టైమ్ 13 నుంచి 25 ఏళ్లు ఉంటుంది. ఈ స్కీమ్ తీసుకోవడానికి తండ్రి వయసు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 65. ఇక అమ్మాయి వయసు విషయానికొస్తే 1 నుంచి 10 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ స్కీమ్ లో నెలవారీ లేదా మూడు నెలలకు ఒకసారి ఆఫర్‌ ఇయర్‌, ఇయర్లీగా చెల్లించవచ్చు. ఒకవేళ పాలసీ తసుకున్న కొంత కాలానికి తండ్రి మరణిస్తే.. కుటుంబం పాలసీని చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రీమియం మొత్తం మాఫీ అవుతుంది. నామినికి పూర్తీ మొత్తం అందుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: