కొన్ని నియోజకవర్గాలు ప్రతిఎన్నికలోను ఒక్కోరకమైన  తీర్పిస్తుంటుంది. అలాంటి విలక్షణమైన తీర్పిచ్చే నియోజకవర్గాల్లో కోనసీమ జిల్లాలోని పీ గన్నవరం నియోజకవర్గం ముఖ్యమైనది. 2004 వరకు నగరం నియోజకవర్గంగా ఉన్నది కాస్త 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినపుడు పీ గన్నవరంగా మారింది. ఈ నియోజకవర్గం విలక్షణం ఏమిటంటే జరిగిన మూడు ఎన్నికల్లోను ఒక్కోసారి ఒక్కోపార్టీని గెలిపించటమే.  అందుకనే రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదే అని బీజేపీ-జనసేన మిత్రపక్షాలు అనుకుంటున్నాయి.





ఇంతకీ విషయం ఏమిటంటే 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పాముల రాజేశ్వరి దేవి, టీడీపీ తరపున పులపర్తి నారాయాణ మూర్తి, పీఆర్పీ తరపున జంగా గౌతమ్ పోటీచేశారు. 44,756 ఓట్లు తెచ్చుకుని రాజేశ్వరి సమీప టీడీపీ అభ్యర్ధి పులపర్తిపైన 3,105 ఓట్ల మెజారిటితో గెలిచారు. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పులపర్తి పోటీచేస్తే వైసీపీ తరపున కొండేటి చిట్టిబాబు పోటీచేశారు. రాష్ట్ర విభజన కారణంగా జనాలు కాంగ్రెస్ పార్టీని సమాధి చేసేశారు.





చిట్టిబాబుపై పోటీచేసిన పులపర్తి టీడీపీ+బీజేపీ+జనసేన మిత్రపక్షాల అభ్యర్ధిగా గెలిచారు. పులపర్తికి 74,967 ఓట్లొస్తే చిట్టిబాబుకు 61,462 ఓట్లు వచ్చాయి. 13,505 ఓట్ల మెజారిటితో టీడీపీ గెలిచింది. చివరగా 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీచేసిన కొండేటి చిట్టిబాబు గెలిచారు. కొండేటికి 67,373 ఓట్లొచ్చాయి. టీడీపీ తరపున పోటీచేసిన నేలపూడి స్టాలిన్ బాబుకు 45,166 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్ధిగా పోటీచేసినన రాజేశ్వరికి 36,259 ఓట్లొచ్చాయి.





అంటే మూడు ఎన్నికల్లోను ఒక్కోపార్టీ అభ్యర్ధిని గెలిపించిన విషయం అర్ధమవుతోంది. సెంటిమెంటు అనండీ లేకపోతే విలక్షణ అనండి రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గం ఓటర్లు ఇదే ఆనవాయితీని కంటిన్యు చేస్తారని మిత్రపక్షాలు బీజేపీ+జనసేన నేతలు అనుకుంటున్నారు. ఎలాగూ మొన్నటి ఎన్నికల్లో జనసేన అభ్యర్ధిగా పోటీచేసిన రాజేశ్వరికి 36,259 ఓట్లొచ్చాయి కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదే అని జనసేన ఆశలు పెట్టుకున్నది. మరి మిత్రపక్షాల తరపున ఎవరు పోటీచేస్తారు ? జనాలు ఎవరిని గెలిపిస్తారో చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: