తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తమిళిసై భర్త డాక్టర్ సౌందర్రాజన్కు సన్మానం చేశారు. డాక్టర్ సౌందర్ రాజన్ ప్రముఖ నెఫ్రాలజిస్ట్గా సేవలందిస్తున్నారు. అయితే ఈయన సేవలకు గుర్తుగా ప్రభుత్వం వీరిని ధన్వంతరి అవార్డును అందించింది. సీఎం కేసీఆర్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని డాక్టర్ సౌందర్ రాజన్ ను శాలువాతో సత్కరించి సన్మానించారు.