ఇంతటి భీభత్సం ఇంతకుముందెన్నడూ జరగలేదు. ఇదేమి వాన. ఒక్క చోట కాదు, ఒక ప్రాంతంలో కాదు.. రాష్ట్రమంతా వర్షాలే. కాదు కాదు.. ఆకాశం నుంచి ఒక్కసారిగా కుమ్మరించిన నీళ్లు. కారుమబ్బులు కమ్ముకొని వచ్చి జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఉరుములు మెరుపులు, ఈదురుగాలుల తోడుగా జడివాన వణికించింది. బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం ప్రభావంతో హైదరాబాద్ సహా రాష్ట్రం మొత్తం భారీ వర్షాలు కురిశాయి. వర్షాల తీవ్రతతో 17 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించాల్సి వచ్చింది.