గత ఏడాది నుండి కరోనా అన్న పేరు ప్రజలను చాలా ఇబ్బంది పెడుతోంది. వారి స్వేచ్ఛను హరిస్తూ, నియమాలతో కట్టడి చేస్తోంది. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎంతోమంది ఈ కరోనా సోకడంతో తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. ఇంకెంతమంది దీనికి బలికావాలంటూ జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఓ వైపు కరోనాకు ఇదే మందు, మా ఔషదం బాగా పనిచేస్తుంది దీంతో కరోనాను జయించవచ్చు అంటున్నారు.