తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అవకాశాలకోసం పరుగుతీసి వివిధ పార్టీల నుంచి తెలంగాణ రాష్టసమితిలో చేరిపోయి మంత్రి పదవులు కొట్టేసిన వారిని తెలంగాణ ప్రజలు ముద్దుగా బీటీ బ్యాచ్ మంత్రులు అంటున్నారు. అంటే బంగారు తెలంగాణ బ్యాచ్ అన్నమాట వీరిది. తలసాని యాదవ్, పట్నం మహేంద్రరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులను బీటీ బ్యాచ్ అంటున్నారు. 2001లో పార్టీ పుట్టినప్పటినుంచి కొనసాగుతూ నానా అగచాట్లూ పడి కేసీఆర్ కేబినెట్‌లో స్థానం సంపాదించుకున్న ఒరిజనల్ మంత్రులకు యూటీ బ్యాచ్ అని పేరుపడింది.  పార్టీ ఆవిర్భావం నుంచి సంవత్సరాలపాటు ఆందోళనల్లో మునిగి, పోలీసు లాఠీచార్జీలను ఎదుర్కొని, కేసుల పాలై జైళ్ల కెళ్లి అష్టకష్టాలు పడిన నిజమైన కార్యకర్తలు, నేతలకు మాత్రం కొత్త ప్రభుత్వంలో చోటు లభించలేదు. అసలు తాము తెరాసకు చెందినవారిమేనా అనే సందేహం కూడా వీరు ఎదుర్కొంటున్నారు.

 

కానీ ముందుంది ముసళ్ల పండుగ అన్నట్లుగా బీటీ బ్యాచ్ సరుకేంటో తేలిపోయే సమయం అసన్నమైంది. తాము ఇప్పుడిప్పుడే కోరుకోని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చి పడటంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయాన్ని సాధించే భారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వీరిమీదే పెట్టారని తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ నెగ్గకపోతే బీచీ బ్యాచ్ మంత్రులు తమ పదవులు కోల్పోవలసి రావడమే తప్ప తట్టా బుట్టా సర్దుకోక తప్పదని కేసీఆర్  తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో బీటీ బ్యాచ్ మంత్రులందరికీ నిద్ర కరువైందని తెలుస్తోంది.

 

బీడీ బ్యాచ్ మంత్రుల్లో తలసాని యాదవ్ సనత్ నగర్ నుంచి రాగా, మహేంద్ర రెడ్డి జీహెచ్ఎంసీ పరిధిలోని రంగారెడ్డి జిల్లాకు చెందినవారు. ఇక తుమ్మల ఖమ్మం జిల్లానుంచి వచ్చారు. వీరిలో తలసాని, మహేందర్ రెడ్డిలను పూర్తి కాలం జీహెచ్ఎంసీ ఎన్నికలపైనే దృష్టిపెట్టవలసిందిగా కేసీఆర్ ఆదేశించారు. అలాగే ఎమ్మెల్యేలు సాయన్న, తీగల క్రిష్ణారెడ్డికి కూడా.. గ్రేటర్ ఎన్నికల్లో పెద్ద బాధ్యతలే భుజాన పెడుతున్నారని అంతా అనుకుంటున్నారు.  ప్రతి వార్డునూ వీరు సందర్సించి పార్టీ పరిస్థితిని మెరుగుపర్చాలని చెప్పారు ఇక తుమ్మల నాగేశ్వరరావు విషయానికి వస్తే తన ఖమ్మం, కమ్మకులం కనెక్షన్ ద్వారా సీమాంద్ర ఓటర్లను ఆకర్షించే భారం మోపారు.

 

బీటీ బ్యాచ్ మంత్రులు తమ సామర్థ్యాన్ని నిరూపించుకునే సమయం ఆసన్నమైమందని, కేబినెట్‌లో వారికి ముఖ్యమైన పదవులు ఇచ్చినందున ఇప్పుడు పార్టీ రుణాన్ని తీర్చుకోవాలని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఏ సమయంలో కూడా అధికార పక్షానికి చుక్కలు చూపిస్తూ వచ్చాయన్న విషయం అందరికీ తెలిసిందే కాబట్టి బీటీ బ్యాచ్ మంత్రులకు ఎన్నికల తర్వాత తమ పరిస్థితి ఇప్పుడే సినీమాలా కనిపిస్తుండటంతో వారు నిద్రకు కరువయ్యారని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: