తెలుగుదేశం పార్టీ మీడియాకు విడుదల చేసిన వైసీపీ ఎమ్మెల్యేల అసెంబ్లీ బూతు పురాణంలో అనేక ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఆ వీడియోల్లో రోజా తర్వాత మళ్లీ ఆ స్థాయిలో విరుచుకుపడిన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే.. అది కొడాలి నానియే.. స్పీకర్ పోడియాన్ని ఆనుకుని నిలుచున్న కొడాలి నాని పిచ్చిపిచ్చిగా రెచ్చిపోయారు. 

స్పీకర్ ముఖం ముందే ప్లకార్డులు ప్రదర్శిస్తూ... మిగిలిన ఎమ్మెల్యేలను కూడా అలాగే చేయమని చెప్పడం ఆ ఫుటేజీలో కనిపించింది. ఏం పర్లెదు సస్పెండ్ అయితే అవుతాం.. మీరు మాత్రం కెమేరాలు కనిపించకుండా ప్లకార్డులు పట్టుకోండి అని మిగిలిన ఎమ్మెల్యేలను నాని ప్రోత్సహించడం వినిపించింది. ఇక కొడాలి నాని మంత్రి అచ్చెన్నాయుడు గురించి రెచ్చిపోయి మాట్లాడారు.. 

ఆడు.. ఆడు.. పరమ సొల్లు సైకోగాడండీ.. ఆడు సొల్లు సైకో గాడు.. అంటూ స్పీకర్ పోడియం ముందే వీరంగం వేశారు.. ఒకసారి, రెండు సార్లు కాదు.. ఆడు సొల్లు సైకోగాడు అనే పదాన్ని ఓ ఐదారు సార్లు అలవోకగా అనేశారు కొడాలి నాని. ఆడు.. ఆ అచ్చెన్నాయుడు.. ఎద్దులా పెరిగాడండీ.. కానీ బుద్దులేదండీ ఆడికి అంటూ రంకెలేశారు. అంతేకాదు.. అచ్చా.. లుచ్చా.. అచ్చా..లుచ్చా.. అంటూ నినాదాలిచ్చారు. 

కొడాలి నాని మొదలుపెట్టిన ఈ నినాదాలకు మిగిలిన ఎమ్మెల్యేలూ వంత పాడారు. నినాదాలతో అసెంబ్లీని హోరెత్తించారు.. కొడాలి నాని ఆ తర్వతా కూడా రెచ్చిపోయారు. ఆళ్లు.. వెధవలండీ.. ఎన్టీఆర్ ను చంపేసిన ఎదవనాయాళ్లీళ్లు.. అంటూ మండిపడ్డారు. టీడీపీ రిలీజ్ చేసిన ఫుటేజీలో రోజా తర్వాత ఎక్కువ అతి చేసింది కొడాలి నానే. రోజాపై ఎలాగూ ఏడాది వేటు పడింది. నెక్స్ట్ టార్గెట్ నానియే అంటున్నారు పొలిటికల్ పండిట్స్.


మరింత సమాచారం తెలుసుకోండి: