ఏ ఎండకాగొడుగు పట్టటం కొద్దిమందికి పుట్టుకతో వస్తుంది. దానికి మినహయింపు కానిది విజయవాడ ఎంపీ లగడపాటి. కాంగ్రెస్ పార్టీలోకి మామగారిని అడ్డం పెట్టుకొని పరిచయాలు పెంచుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేదల కోసం మండుటెండలో కాలినడకతో రాష్ట్ర పర్యటన మొదలు పెట్టినప్పుడు ఆయనకు వెనుక ఎ.సి.వాహనంలో అనుసరించి ఆ యాత్ర మొత్తాన్ని తానే స్పాన్సర్ చేసినట్లు బిల్డప్ ఇచ్చారు. ఆ సమయంలోనే లగడపాటి వైయస్సార్ కు ఓ మంచి ఫారెన్ షూ కూడా ప్రజెంట్ చేశారు. నడిచేటప్పుడు కాళ్లకు నెప్పులు రాకుండా, బొబ్బలు రాకుండా, చేసిన సేవలకు ప్రతిఫలంగా లగడపాటి లోక్ సభ టిక్కెట్ పొందారన్న ప్రచారం జరిగింది. ఈ రోజు లగడపాటి రాజకీయాలలో ఉన్నారంటే అందుకు కారణమైన వైయస్ రాజశేఖర్ రెడ్డిని తన రాజకీయ గురువుగా కొలవక పోయినా పర్వాలేదు కానీ వైయస్ అకాల మరణం తర్వాత ప్లేట్ ఫిరాయించడం వెనుక కారణం ఏమై ఉంటుందని చర్చ బెజవాడలో జోరుగా సాగుతోంది. ఒకపుడు లగడపాటి అత్యంత సన్నిహితుడుగా ఉన్న గౌతం రెడ్డికి అప్పగించినట్లుంది. దీనితో గౌతం రెడ్డి ఒంటికాలిపై లగడపాటిపై లేస్తున్నారు. వైయస్ పదవిని అడ్డుపెట్టుకుని జగన్ అక్రమ ఆస్తులు సంపాదించారని, జగన్ నేరస్తుడని, విజయమ్మ జగన్ ని సరిగా పెంచలేదని లగడపాటి అంటుంటే వైయస్ మరణం తర్వాత గాని లగడపాటికి అక్రమ ఆస్తులు గుర్తుకు రాలేదా. అంత అక్రమ ఆస్తులున్న సాక్షీ దినపత్రికల్లో లగడపాటి సక్రమ ఆస్తులను 30 కోట్లు పెట్టడం దేనికి? ప్రాజెక్టులన్నింటిలో అవినీతి జరిగింది అని లగడపాటి తెలుగు గంగ ప్రాజెక్టుకు కాంట్రాక్టు పనులు ఎలా తీసుకున్నారో సెలవివ్వాలని గౌతం రెడ్డి అంటున్నారు. ఇన్ని ఆరోపణలు వైయస్సార్ చనిపోక ముందు చేస్తే లగడపాటి మాటకు విలువ వుండేదిని కూడా గౌతం రెడ్డి అంటున్నారు. ఆస్ట్రేలియాలో వర్థమాన్ ఫెర్టిలైజర్ ని లగడపాట మోసం చేశారని, వెస్ట్రన్ ఆస్ట్రేలియా సుప్రీం కోర్టులో ల్యాంకో కంపెనీపై 16వేల కోట్లు నష్టపరిహారం దావా వేసారని, ల్యాంకోలో పెట్టుబడి పెట్టిన షేరు హోల్డర్కు కోట్లాది రూపాయలు నష్టం కలిగించటానికి కారణం లగడపాటి అనైతిక వ్యాపారాలే కారణమని గౌతం రెడ్డి ఆరోపిస్తున్నారు. దివాళాతీసిన గ్రిఫిన్ కోల్ మైన్స్ ను ఐసీఐసైఐకి తాకట్టు పెట్టి 3000 కోట్ల రూపాయలు అక్రమ పద్దతిలో పొందిన ల్యాంకో పై మీరు మీ నియోజక వర్గ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఒక బాధ్యతాయుమైన పార్లమెంటు సభ్యుడిగా వుంటూ సీబీఐ ఆఫీసర్ ల క్ష్మీనారాయణ కాల్ లిస్టుపై హైకోర్టు విచారణ చేపట్టిన తర్వాత లగడపాటి ఆయనను వెనుకేసుకురావడం వెనుక కారణం మీ తమ్ముడ్ని జగతి పబ్లికేషన్స్లో పెట్టుబడి పెట్టినా జె.డి. విచారణ చేపట్టక పోవడమేనా ఇంకేమైనా లాభాపేక్షవుందా అని ప్రశ్నించారు. గౌతం రెడ్డి న్యాయవాది కూడా అయినా గౌతం రెడ్డి ఇలా ప్రశ్నలమీద ప్రశ్నలు సంధిస్తున్నప్పటికి రాజగోపాల్ ఒక్క సమాధానం కూడా చెప్పకపోవటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: