గ‌త ముగిసిన శీత‌కాల స‌మావేశాల్లో వైఎస్ఆర్ సీపీ నేత‌, న‌గ‌రి ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఏపీ సీఏం చంద్ర‌బాబు, స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ ల‌పై అసభ్య‌క‌ర‌ప‌ద‌జాలంతో మాట్లాడారని, స‌భా గౌవ‌రాన్ని పాటించ‌లేద‌ని ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ స‌భా కార్యాల‌యం నిర్ణ‌యం తీసుకుంది. అయితే రోజా పై అసెంబ్లీ స్పీక‌ర్ తీసుకున్న సస్పెన్ష‌న్ తీర్మానం చెల్ల‌ద‌ని హైకోర్టు ఇచ్చిన మ‌ధ్యంత‌ర తీర్పు పై ధ‌ర్మాస‌నం ముందు అప్పీల్ చేసే విష‌యంలోనై టీడీపీ ద్వంద్వ ప్ర‌యాణాల‌నే పాటించిందా? ధ‌ర్మాస‌నం ముందు దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను ప‌రిశీలిస్తే అవుననే తెలుస్తోంది. అసెంబ్లీ తీర్మానాన్ని చెల్ల‌ద‌ని న్యాయ‌స్థానం తీర్పు వెలువ‌రిస్తే... దానిపై అసెంబ్లీ కార్య‌ద‌ర్శి ద్వారా కాకుండా ఆర్థిక‌, శాస‌న స‌భా వ్య‌వ‌హారాల శాఖ ముఖ్య కార్య‌దర్శి ద్వారా అప్పీల్ దాఖ‌లు చేయించడంతోనే టీడీపీ నేత‌ల డొల్ల‌త‌నం బ‌య‌ట ప‌డింది. అసెంబ్లీకి హాజ‌రుకాకుండా రోజాపై ఏడాది పాటు స‌స్పెన్ష‌న్ విధిస్తూ చేసిన తీర్మానం చెల్ల‌ద‌ని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్త‌ర్వుల‌తో ప‌రువు ప్ర‌తిష్ట కోల్పోయింది టీడీపీ స‌ర్కార్.


ఈ ఇష్యూలో త‌ప్పు చేశామా, త‌ప్పు చేస్తే ఎలా దాని నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాల‌ను ప్రారంభించింది. హైకోర్టు ఆదేశాల‌ను గురువారం రోజునే స్వ‌యంగా రోజా తీసుకొచ్చి శాస‌న‌స‌భ కార్య‌ద‌ర్శికి అంద‌జేయ‌డ‌మే కాకుండా న్యాయ‌స్థానం ద్వారా అధికారికంగా కూడా ఆ ఉత్త‌ర్వులు అందిన విష‌యం తెలిసిందే. దానిపై ఏం చేయాల‌న్న అంశం పై తర్జ‌న భ‌ర్జ‌న ప‌డిన ముఖ్య‌మంత్రి, మంత్రులు ఆ తీర్పు పై అప్పీల్ చేయాల‌న్ననిర్ణ‌యానికి వచ్చారు. ఆ తీర్పు ప్ర‌తిని అందించిన త‌రువాత శుక్ర‌వారం తాను శాస‌న స‌భ సమావేశాల‌కు హాజ‌రవుతాన‌ని కూడా రోజా అక్క‌డే ప్ర‌క‌టించారు. రోజా స‌భాకు వ‌స్తాన‌ని ప్ర‌క‌ట‌న  చేసిన నేప‌థ్యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డిన టీడీపీ నేత‌లు ధ‌ర్మాస‌నం ముందు అప్పీల్ చేయాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చారు. అయితే ఇక్క‌డ ఎవ‌రి ద్వారా  అప్పీలు చేయించాల‌న్న దానిలోనే తిర‌కాసు దాగి ఉంది. ఎందుక‌న‌గా... శుక్ర‌వారం శాస‌న స‌భ‌లో అంశం ప్ర‌స్తావన‌కు వ‌చ్చిన‌ప్పుడు స్పీక‌ర్ మాట్లాడుతూ.... రోజాను స‌స్పెండ్ చేయడ‌మ‌న్న‌ది స‌భ ఏక‌గ్రీవంగా తీసుకున్న నిర్ణ‌యంగా చెప్పారు.


టీడీపీ నేత‌లు మంత్రి రావెల కిషోర్ బాబు

కోర్టు తీర్పు పై రావెల సంచ‌ల‌న కామెంట్ !

అంత‌కుముందు టీడీపీ నేత‌లు మంత్రి రావెల కిషోర్ బాబు, ఎమ్మెల్యేలు బోండా ఉమామ‌హేశ్వ‌రరావు, గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి త‌దిత‌రులు మీడియాతో మాట్లాడుతూ.. రోజా స‌స్పెన్ష‌న్ తీర్మానం చెల్ల‌దంటూ కోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వులు లెక్క చేయ‌బోమ‌ని, స్పీక‌ర్ తీర్పుపై జోక్యం చేసుకునే అధికారం కోర్టుల‌కు లేద‌ని తెలిపారు. నిజానికి  రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయాలంటూ అసెంబ్లీలో చేసింది ఏక‌గ్రీవ తీర్మానం కాదు. శీత‌కాల సమావేశాల్లో డిసెంబ‌ర్ 18 న రోజా ను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ శాస‌న స‌భ వ్య‌వ‌హారాల మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు తీర్మానం ప్ర‌తిపాదించిన‌ప్పుడు ప్ర‌తిప‌క్షం తీవ్రంగా వ్య‌తిరేకించింది. 340 నిబంధ‌న కింద ఏడాది పాటు సస్పెండ్ చేసే అధికారం లేద‌ని ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అసెంబ్లీ రూల్స్  ను ఉటంకిస్తూ సోదాహ‌ర‌ణ‌గా చెప్పారు. 


ఆ స‌మ‌యంలో రోజాకు మాట్లాడే అవ‌కాశం కూడా ఇవ్వ‌క‌పోగా, అమె స‌భ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన త‌రువాత మాత్ర‌మే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కి మాట్లాడే అవ‌కాశం ఇస్తామ‌ని ప‌ట్టుబ‌ట్టి ఆమెను బ‌య‌ట‌కు పంపించారు. స‌భ ఏక‌గ్రీవంగా చేసిన తీర్మానం కాద‌న్న విష‌యం అంద‌రికీ తెలుసు. అందుకు విరుద్దంగా స‌భ ఏక‌గ్రీవంగా తీసుకున్న నిర్ణ‌యం అంటూ ఈ రోజు స‌భ‌లో ప్ర‌క‌ట‌న చేయ‌డం నిజంగా విడ్డూర‌మే. ఆ తీర్మానం  చెల్లుబాటు కాద‌ని హైకోర్టు తీర్పును  ప‌ట్టించుకోమ‌ని ఒక‌వైపు చెబుతూ రెండో వైపు ఆ తీర్పు పై అప్పీలు చేయ‌డం ఇక్క‌డ గ‌మ‌నించ‌ద‌గ్గ విష‌యం. స్పీక‌ర్ నిర్ణ‌యం పై కోర్టులు జోక్యం చేసుకోరాద‌ని చెబుతున్న నేత‌లు అలాంట‌ప్పుడు ఏమీ ప‌ట్టించుకోమ‌ని వ‌దిలేయ‌కుండా మ‌ళ్లీ అప్పీలు కు వెళ్ల‌డం విచిత్రం. స్పీక‌ర్ నిర్ణ‌యం పై జోక్యం చేసుకునే అధికార‌మే లేద‌ని చెప్పిన‌ప్పుడు సింగిల్ బెంచి తీర్పు పై  స్టే కోర‌డ‌మంటే ముందు వ‌చ్చిన తీర్పును అంగీక‌రించిన‌ట్టే అవుతుంది.

రోజాను స‌స్పెండ్ చేయ‌మ‌న్న‌ది


ఇక్క‌డ మ‌రో విచిత్ర‌మేమిటంటే... రోజాను స‌స్పెండ్ చేయ‌మ‌న్న‌ది శాస‌న స‌భ ఏక‌గ్రీవంగా చేసిన తీర్మానం అని చెప్పిన‌ప్పుడు పై కోర్టు లో అప్పీలు ను శాస‌న స‌భ కార్య‌ద‌ర్శి మాత్ర‌మే దాఖ‌లు చేయాలి. అలా కాకుండా శాస‌న స‌భ వ్య‌వ‌హారాల‌కు సంబంధం లేని ఒక ప్ర‌భుత్వ అధికారితో అప్పీలు దాఖ‌లు చేయించ‌డం. అంటే రేప‌టి రోజున ధ‌ర్మాసంన సింగిల్ బెంచ్ తీర్పు ను స‌మ‌ర్థిస్తే... ఒక మాట, స్టే ఇస్తే మ‌రో మాట చెప్పుకోవ‌డానికి  వీలుగా ఈ రకంగా  అప్పీలు ను ప్రభుత్వం అధికారితో దాఖ‌లు చేయించార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది. సింగిల్ జ‌డ్జి ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను స‌వాలు చేస్తూ శాస‌న స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ముఖ్య కార్య‌ద‌ర్శి ధ‌ర్మాస‌నం ముందు అప్పీలు దాఖ‌లు చేశారు.


సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని ముఖ్య కార్యదర్శి తన అప్పీలులో కోరారు. ఈ అప్పీలుపై ధర్మాసనం సోమవారం వాదనలు విననుంది. అంటే ఓరాల్ గా గ‌న‌క గ‌మ‌నిస్తే టీడీపీ కావాల‌ని  చేసిన‌ట్టు గా ఉన్న‌ట్లు గ‌మ‌నించాలి.  అయితే ఏం ఆశించి టీడీపీ ఇలా స‌మ‌యాన్నీ వృదా చేస్తుందో తెలియ‌దు కానీ.. అన‌వస‌ర‌పు నిర్ణ‌యాలే ఈ ఇష్యూలో ఎక్కువ‌గా ఉన్న‌ట్లు ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. రోజా రాక‌తో అసెంబ్లీ లో అధికార పార్టీ జ‌రిగే న‌ష్ట‌మేంటో అర్థం కావడంలేదు గానీ.. కావాల‌ని చేస్తున్న రాదాంతమే ఎక్కువ‌గా క‌న‌బ‌డుతోంది. కొస‌మేరుపు ఎంటంటే ఈ ఇష్యూలో అధికార  టీడీపీ కంటే వైకాపా కే ఎక్కువ రాజ‌కీయ లాభం చేకూరుతుంద‌న‌టంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: