సహజంగా చంద్రబాబు మీడియా మేనేజ్ మెంట్ లో దిట్ట.. ఆ  కళ ఆయనకు అబ్బినట్టు దేశంలో మరే నేతకూ అబ్బలేదు. కానీ అలాంటి లీడర్ ఇప్పుడు కొన్ని మీడియాల పట్ల కోపం ప్రదర్శిస్తున్నారు.. ఆ మీడియా తనకు ప్రయారిటీ ఇవ్వడం లేదనో.. మిగిలిన వారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారనో.. ఇంకే కారణమో కానీ.. ఆయన సంయమనం కోల్పోతున్నారనిపిస్తోంది. 


ఇటీవల చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంపై మొదట ఆంధ్రజ్యోతి పత్రిక ప్రత్యేక కథనాలిచ్చింది. దాన్ని ఈనాడు ఫాలో అయ్యింది. ఆ తర్వాత ఏబీఎన్ రాధాకృష్ణ చంద్రబాబును ఇంటర్వ్యూ చేశారు.. ఆ తర్వాత ఈటీవీ కూడా ఇంటర్వ్యూ చేసింది. ఈ రెండు టీవీ ఇంటర్వ్యూల తర్వాత హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు టీవీ9 కు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. 


ఈ ఇంటర్వ్యూ మొదట బాగానే సాగినా.. కొద్దిసేపటికే చంద్రబాబు సంయమనం కోల్పోవడం ప్రారంభించారు. చంద్రబాబు చెబుతుంటే మధ్యలో కల్పించుకుని టీవీ9 రిపోర్టర్ మురళీ కృష్ణ ప్రశ్నించారు. దీంతో బాబుకు చిర్రెత్తింది.. మీరు మారరా.. మీ మైండ్ సెట్ మీదేనా.. చెప్పేది మొత్తం వినకుండానే మధ్యలో ప్రశ్నలు వేస్తావేంటి.. నీకు ఇది బాగా అలవాటైపోయంది.. అని గట్టిగానే అన్నారు.


మీరు ఎప్పుడూ నెగిటివ్ కోణంలోనే ఉంటారా.. మీకు ఇదో ఫ్యాషనైపోయింది.. అంటూ చంద్రబాబు చిరాకు పడ్డారు. జగన్ విధ్వంసం కోసం పని చేస్తుంటే దాన్ని మీరేదో పోరాటం అంటూ చిత్రీకరిస్తున్నారని మీడియాపై మండిపడ్డారు చంద్రబాబు.. వాళ్లేదో పోరాడుతున్నారని మీరు బిల్డప్ ఇస్తున్నారు.. అసలు అది అపోజిషన్ పార్టీయే కాదంటూ చంద్రబాబు రెచ్చిపోయారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: