చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యాడు. అటు పవన్ పరిస్థితి కూడా అంతే. విజయం సాధించాలని ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. దీనికి కారణం లేకపోలేదు. బాబు ఓటమికి వాస్తు దోషమే కారణం అని అంటున్నారు.
వాస్తు కారణంగా సమస్యలు వస్తుంటాయి. వాస్తు సరిగా లేకుంటే.. దాని వళ్ళ ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఒక్కోసారి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా వాస్తు ప్రభావితం చూపిందని అంటున్నారు వాస్తు నిపుణులు.
కారకట్టపైన ఉన్న బాబు ఇంటికి వాస్తు బాగాలేదని, వాస్తులోపం కారణంగానే పార్టీ ఓటమితో పాటు అటు లోకేష్ కూడా ఓడిపోయాడని వార్తలు వస్తున్నాయి. అటు జనసేన పార్టీకికి కూడా వాస్తు దోషం ఉందని, ఇదే పవన్ ఓటమికి కారణం అయ్యాయని చెప్తున్నారు.
బాబు విజయవాడలో నివాసం ఉంటె పార్టీ గెలవలేదని, గుంటూరువైపు ఉంటూనే భవిష్యత్తులో పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పారు. పవన్ కూడా అలానే చేయాలని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. విజయవాడలోని నాయకులకు పెద్దగా కలిసి రాదు. విజయవాడ ఆటో మొబైల్ రంగానికి మాత్రమే అనుకూలం. అదే గుంటూరు మాత్రం రాజకీయాలకు అనుకూలం అని వాస్తు జ్యోతిష్యాలు చెప్తున్నారు.