ఫైబర్ గ్రిడ్
ప్రాజెక్టులో కూడా తెలుగుదేశంపార్టీ నేతలు అందినకాడికి ఫుల్లుగా దోచుకున్నారు.
ఒక్క సెట్ టాప్ బాక్సు కొనుగోళ్ళలోనే వందల కోట్ల రూపాయాల అవినీతి జరిగిందన్నది
వాస్తవం. దీనిపై అప్పట్లోనే పెద్ద దుమారం లేచినా ప్రభుత్వం ఏమాత్రం
పట్టించుకోలేదు. ఎందుకంటే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు అములు మొత్తం అప్పటి ఎంఎల్ఏలు, అధికారుల పర్యవేక్షణలోనే జరిగింది
కాబట్టి.
ఒకే కనెక్షన్ తో ఇంటర్నెట్, ఫోన్, టివి ఛానళ్ళు కాన్సెప్ట్ వినటానికి బాగుంది కానీ వాస్తవంగా తెలుగుదేశంపార్టీ ప్రచారానికి మాత్రమే ఉపయోగపడింది. ప్రాజెక్టును తీసుకురావటంలో చంద్రబాబునాయుడు ఉద్దేశ్యం కూడా అదే. పోనీ అదన్నా సక్రమంగా అమలు చేశారా అంటే అదీ లేదు.
ఫైబర్ గ్రిడ్ టెక్నాలజీ మామూలుగా పట్టణాల్లో, గ్రామాల్లో అప్పటి వరకూ ఉన్న కేబుల్ ఆపరేటర్లకు అర్ధం కాలేదు. దాంతో కనెక్షన్ తీసుకున్న కొద్ది రోజులకే సెట్ టాప్ బాక్సులో సాంకేతిక సమస్యలు మొదలయ్యాయి. దాన్ని బావుచేసే సామర్ధ్యం కేబుల్ ఆపరేటర్లకు లేదు. దాంతో సెట్ టాప్ బాక్సుల రిపేర్ ను ఆపరేటర్లు పట్టించుకోలేదు. ఫలితంగా వేల రూపాయలు పెట్టి కొన్న వినియోగదారులు నష్టపోయారు. మళ్ళీ ఇంకో సెట్ టాప్ బాక్సు కొనాలంటే మళ్ళీ 4500 రూపాయలు పెట్టాలంటే స్తోమత లేక దానికి దూరంగా ఉండిపోయారు.
సెట్ టాప్ బాక్సుల సమస్యలను కారణాలుగా చూపించి కేబుల్ ఆపరేటర్లు కూడా మళ్ళీ జనాలను కేబుల్ ఛానళ్ళ వైపే లాగేశారు. దాంతో మళ్ళీ డిపాజిట్లు కట్టాల్సొచ్చింది వినియోగదారులకు. ఇలా అడ్డదిడ్డంగా పథకాన్ని అమలు చేసిన నేపధ్యంలో వేల కోట్ల అవినీతి జరిగిందన్నది వాస్తవం.
మార్కెట్లో రూ. 3 వేలకే దొరికే సెట్ టాప్ బాక్సును ప్రభుత్వం వినియోగదారులకు బలవంతంగా రూ. 4500కు కట్టబెట్టిందంటేనే తెలుస్తోంది. ఏ స్ధాయిలో అవినీతి జరిగిందో. కాకపోతే జరిగిన ప్రతీ అవినీతిని ప్రభుత్వం నిరూపించలేకపోవచ్చు. ఆ ధైర్యంతోనే అవినీతి నిరూపించమని నారా లోకేష్ కూడా సవాలు విసరటమే విచిత్రంగా ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి