వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్లో యమా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఆయన పోస్టులు చాలా వైల్డ్ గా.. ఘాటుగా ఉంటాయి కూడా. అయితే ఇటీవల అధికారం కోల్పోయిన తర్వాత నారా లోకేశ్ కూడా ట్విట్టర్లో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.


వైసీపీ సర్కారుపై రోడూ నాలుగైదు ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. లోకేశ్ దూకుడుతో చిర్రెత్తిన విజయసాయరెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు. ప్రజల వేళ్లపై పోలింగు రోజు వేసిన సిరా మరక ఇంకా చెరగకముందే...గుండెలు బాదుకునే బ్యాచ్‌ వీధుల్లోకి వచ్చిందని నారా లోకేశ్‌ అండ్ టీమ్ పై విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.


మంగళగిరి ప్రజలు పొర్లించి కొట్టిన మాలోకానికి కాస్త వేచి చూడాలన్న స్పృ హ కూడా లేదని.. ఆయన అప్పుడే ఏడుపు లంకించుకున్నాడని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. అవినీతి లేని రాష్ట్రంగా ఏపీకి కొత్త ఇమేజి తీసుకొస్తామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెబుతుంటే పచ్చ పార్టీ నేతలు మాత్రం పరిశ్రమలు రావంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.


అవినీతిని వ్యవస్థీకృతం చేసిన చంద్రబాబు... ఆ అవినీతి లేకుండా పనులెలా జరుగుతాయనడంలో వింతేమీ లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోవైపు జగన్ పాలనపై విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీల్లో 80 శాతం నెరవేరేందుకు అనుగుణంగా తమ ప్రభుత్వం తొలి బడ్జెట్‌లోనే కేటాయింపులు జరిపిందన్నారు విజయసాయిరెడ్డి .


క్షేత్రస్థాయిలో కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా అర్హులందరూ నవరత్నాల ద్వారా లబ్ది పొందేలా చూస్తామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉందని గొప్పలు చెప్పుకొనే చంద్రబాబు ప్రతిపక్షనేతగా పూర్తిగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ఇదే విజయసాయిరెడ్డి ఇటీవల నారా లోకేశ్ ను హింసించే రాజు పులికేసిగా వర్ణిస్తూ సెటైర్ వేశారు కూడా.


మరింత సమాచారం తెలుసుకోండి: