ఆ దృశ్యం ఎంతో కన్నుల పండుగ్గా వుంది.ఈ అద్బుతాన్ని చూడడానికి నాగార్జున సాగర్ వద్ద కొన్ని వేల మంది క్యూ కడుతున్నారు.ఇక సెలవు దినాల్లో అయితే నాగార్జున సాగర్ అంతా ట్రాఫిక్ జామ్ తో కిటకిటలాడుతోంది. ఈ అందాలను చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో ప్రయాణికులు ప్రకృతి ప్రేమికులు తరలివస్తున్నారు. చాలా అరుదుగా మొత్తం ఇరవై ఆరు గేట్లను ఎత్తివేయడం జరుగుతూ ఉంటుంది కనుక ఈ నిండు కుండను తలపిస్తున్న నాగార్జున సాగర్ అందాలను జాలువారుతున్న ఆ నది అందాలను చూడటానికి చాలా మంది ఎదురుచూస్తున్న పర్యాటకులు ఫిదా అవుతున్నారు.
అంతకంతకు నాగార్జున సాగర్ వద్ద గంట గంటకూ వరద ప్రవాహం పెరుగుతూనే ఉంది. శ్రీశైలం వద్ద కూడా వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో శ్రీశైలం నీటిని నాగార్జున సాగర్ కు వదిలారు దీని కారణంగా మొత్తం ఇరవై ఆరు గేట్ల ను ఎత్తివేయగా మధ్యలో రోడ్ తరవాత ఈ అందాలను ప్రత్యక్షంగా చూడ్డానికి వచ్చిన చాలామందికీ పిల్లలకు స్కూల్ బుక్స్ లో ఉన్నట్టుగా నేరుగా చూసి ఆనంద పడుతున్నారు.నాగార్జున సాగర్ ప్రాజెక్టు గురించి అది ఎలా పని చేస్తుంది అని చాలా మంది పేరెంట్స్ దగ్గరుండి చూపించాలన్న ఉద్దేశంతో నాగార్జున సాగర్ కు తీసుకువెళ్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తోందని చెప్పుకోవచ్చు.