ఏపీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డి వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నారు. ఆయన పాలన తీరుపై చాలా మంది స్పందిస్తున్నారు. మిగిలిన వారి విషయం వదిలేస్తే.. జగన్ పై గతంలో విమర్శలు చేసిన వారిలో కొందరు ఇప్పుడు జగన్ కు వందకు వంద మార్కులు అంటూ కామెంట్ చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు.


జేసీ దివాకర్ రెడ్డి.. ఒకప్పుడు వైయస్ జగన్ పై లెక్కలేనన్ని ఈయన చాలా ఆరోపణలు చేసారు. అనుభవం లేదని విమర్శించారు. అదే జేసీ ఇప్పుడు జగన్ పాలకు వందకు వంద మార్కులు ఇస్తున్నానని కామెంట్ చేయడం పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశమైంది. గతంలో జేసీ చేసిన విమర్శలను గుర్తు తెచ్చుకుని ఔరా ఎంత మార్పు అని విశ్లేషిస్తున్నారు.


ఇక గతంలో జగన్ పై విమర్శలు చేసిన జనసేన పార్టీ నేత కూడా ఇటీవల జగన్ పై ప్రశంసలు కురిపించడం గుర్తు చేసుకోవచ్చు. వైయస్ జగన్ నిర్ణయాలను చూసి తొలి అసెంబ్లీ సమావేశంలోనే ఫిదా అయిపోయారు జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. అడకుండానే వరాలిచ్చే దేవుడు వైయస్ జగన్ అంటూ అసెంబ్లీ సాక్షిగా తన ఉద్దేశ్యాన్ని వెలిబుచ్చారు రాపాక. మత్స్యకారులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ తొలి బడ్జెట్ లోనే 10లక్షలు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేసారు. ప్రజలంతా జగన్ ను ఇంతలా ఎందుకు అభిమానిస్తారో ఇప్పుడే అర్థమైందన్నారు.


ఇక ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన మరో వ్యక్తి జేడీ లక్ష్మీ నారాయణ.. గతంలో జగన్ పై పెట్టిన కేసుల విచారణ సందర్భంగా అప్పట్లో ఎల్లో మీడియా ఈయన్ను హోరోను చేసింది. జగన్ మోహన్ రెడ్డిపై పెట్టిన కేసు అక్రమమే అంటూ నాడు విచారణ చేసి, నేడు జనసేనలో చేరిన ఈడీ అధికారి జేడీ స్వయంగా తన నోటితో ఒప్పుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: