ఓవైపు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని చెబుతున్నా..ఏపీ సీఎం జగన్ మాత్రం పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇచ్చిన మాట తప్పకూడదని గట్టి నిర్ణయంతో ఉన్నారు. ఇప్పటికే ఆయన వాహన మిత్ర పేరుతో ఆటోవాలాలకు రూ. 10,000 రూపాయలు అందించారు.


3648 కిలోమీటర్ల పాదయాత్రలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలందరి కష్టాలు విన్నారు.. దగ్గర నుంచి చూశారని, పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒక్కొకటిగా సీఎం అమలు చేస్తున్నారు. పాదయాత్రలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఇచ్చిన హామీ మేరకు రూ. 10 వేల ఆర్థిక సాయాన్ని అందజేస్తూ.. వైయస్‌ఆర్‌ వాహనమిత్ర పథకాన్ని అమలు చేస్తున్నారు.


ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయాన్ని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని, రహదారి ప్రమాదాలను తగ్గించాల్సిన బాధ్యత ఆటోవాలాలపై ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఆటోవాలాలతో పాటు మరి కొన్ని వర్గాలకూ జగన్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. ఇది కూడా పాదయాత్రలో ఇచ్చిన హామీయే.


ఆంధ్రప్రదేశ్ లోని రజకులకు, నాయీ బ్రాహ్మణులకు, టైలర్లకు ఏటా రూ. 10 వేల సాయం అందిస్తామని వైఎస్ జగన్ పాదయాత్రలో పలుసార్లు చెప్పారు. ఇప్పుడు ఆటోవాలాలకు పది వేల రూపాయల సాయం అందడంతో ఇక ఆ కులాల వారు కూడా జగన్ వైపు చూస్తున్నారు. మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. ఇందుకు జగన్ కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.


ఈ విషయంపై ఏపీ వ్యవసాయ మంత్రి కన్నబాబు క్లారిటీ ఇచ్చారు. ఆటోవాలాల తరహాలోనే రజకులకు, నాయీ బ్రాహ్మణులకు కుడా రూ. 10,00 ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ త్వరలోనే అమలవుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోందని కన్నబాబు చెప్పారు. ఏదేమైనా జగన్ మాట ఇస్తే తప్పేది లేదన్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: