ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  టిడిపి పార్టీకి నేతలకు రోజు రోజుకి ఒక కొత్త షాక్  తగులుతుంది . గత కొన్ని రోజుల నుండి ఆంధ్ర రాజకీయాల్లో  ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర రాజకీయాల్లో  రోజుకో ట్విస్ట్ తెరపైకి వస్తోంది. కాగా టీడీపీ నేతలు, నేతల ముఖ్య అనుచరులను కూడా వైసీపీ తమ పార్టీలోకి ఆకర్షిస్తోంది. ఇప్పటికే టిడిపి పార్టీకి చెందిన ముఖ్య నేతలు అందరూ వైసీపీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. టిడిపి రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసినదే.  ఇక తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలోకి జంప్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా టీడీపీ  ముఖ్య నేతలైన జెసి బ్రదర్స్ కి మరో షాక్ తగిలింది. జెసి బ్రదర్స్ కి ముఖ్య అనుచరుడైన షబ్బీర్ భాష వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. 

 

 

 

 ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో  ఈ అంశమే హాట్ టాపిక్ గా మారిపోయింది. జెసి బ్రదర్స్ కు రైట్ హ్యాండ్ గా ఉండే షబ్బీర్ భాష సడన్గా వైసిపి తీర్థం ఎందుకు పుచ్చుకున్నారు. వైసీపీ నుంచి ఏమైనా బెదిరింపులు వచ్చాయా... లేక ఇంకేదైనా కారణం వల్ల వైసీపీ లోకి వెళ్లారా అనే ప్రశ్నలు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో తలెత్తాయి. జెసి బ్రదర్స్ ప్రధాన అనుచరుడైన షబ్బీర్ భాషను తాడిపత్రి ఎమ్మెల్యే పెద్ద రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. షబ్బీర్ భాషతో పాటు 500 మంది జెసి బ్రదర్స్ అనుచరులు వైసీపీ కండువా కప్పుకున్నారు. తాను వైసీపీలో చేరడం పై స్పందించిన షబ్బీర్  భాష... తాను వైసీపీలో చేరాలంటూ ఎవరి బెదిరింపులకు గురి చేయడం కానీ ఒత్తిడి తీసుకురావడం కానీ చేయలేదని స్వచ్ఛందంగానే తాను  వైసీపీలో చేరనని తెలిపారు. 

 

 

 

 తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి నచ్చి  పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. జేసీ బ్రదర్స్ కీ  ముఖ్య అనుచరుడైన షబ్బీర్ భాష వైసీపీలో చేరడంతో జేసీ బ్రదర్స్ కు  షాక్ తగిలినట్టైంది. జెసి బ్రదర్స్ కు రైట్ హ్యాండ్ గా ఉండే షబ్బీర్ బాషా జెసి బ్రదర్స్ ట్రాన్స్ పోర్టు  వ్యవహారాలన్నీ చూసుకుంటాడు... కాగా గత కొన్ని రోజుల నుండి జేసీ బ్రదర్స్ కి  షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే జెసి దివాకర్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి పర్మిట్స్  లేకపోయినా బస్సులు నడుపుతున్నారు అంటూ కొన్ని బస్సులపై కేసులు నమోదు చేశారు ఆర్టీఏ అధికారులు. దీంతో తాత్కాలికంగా బస్సు ట్రావెల్స్ ను నిలిపి  వేస్తున్నట్లు జెసి దివాకర్ తెలిపిన విషయం తెలిసిందే.అయితే తాజాగా షబ్బీర్ భాష వైసీపీ తీర్థం పుచ్చుకోవడం పై జేసీ బ్రదర్స్ ఎలా స్పందిస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది,

మరింత సమాచారం తెలుసుకోండి: