ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుండి  పేద ప్రజలకు మెరుగైన విద్యను అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. పేద ప్రజలందరూ తమ  పిల్లలను బడికి  పంపించేందుకు ఇప్పటికే అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ప్రతి కుటుంబంలోని ఒక విద్యార్థికి 15 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు నిర్ణయించింది జగన్ సర్కార్. రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థులు  పాఠశాలలకు వెళ్లి చదువుకోవాలనే  ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు జగన్ సర్కార్ తెలిపింది. అంతే కాకుండా తాజాగా మరో పథకాన్ని జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 

 

 

 

 రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టి కార్పొరేట్ స్థాయిలో పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు జగన్ సర్కారు నిర్ణయించింది. అయితే ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం అనే అంశం తెర మీదికి వచ్చినప్పటినుంచి ప్రతిపక్షాలన్నీ అధికార వైసీపీ పై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నట్లు జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి ధాపగా  అన్ని ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలవుతుందని జగన్ సర్కార్ తెలిపింది. ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక్కో తరగతి పెంచుతూ పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ విద్యార్థులకు అందుబాటులో ఉంచనున్నారు . 

 

 

 

 అయితే అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మాధ్యమం తో పాటు తెలుగు ఉర్దూ లలో  ఒక భాష తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది జగన్ సర్కార్. కాగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో  ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టిన నేపథ్యంలో బోధనకు గాను టీచర్ల నియామకాలు,  శిక్షణ చేపట్టేలా విద్య కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఇంగ్లీష్ మాధ్యమానికి అమలుకు వేటీచర్ల హ్యాండ్ బుక్ లు,  శిక్షణ కార్యక్రమాలు రూపొందించాలి అంటూ  ఆదేశించారు. ఇంగ్లీష్ మీడియం బోధించే టీచర్ల నైపుణ్యాల అభివృద్ధికి ఎస్ఈఆర్టి  తో సమన్వయం చేసుకోవాలంటూ విద్యాశాఖ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఇప్పటికే జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: