మహారాష్ట్ర రాష్ట్రంలో  శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఏర్పడిన 'మహా వికాస్ అఘాడీ' సంకీర్ణ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో గెలుపొందింది. రాష్ట్రంలో మొత్తం 288 సీట్లు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో మెజార్టీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 145 సీట్లు కాగా, ఉద్దవ్ సర్కారుకి  189 ఓట్లు పాలు అయ్యాయి. ప్రొటెం స్పీకర్ దిలీప్ వాల్ నే పాటిల్ హెడ్ కౌంట్ కు ఆదేశించగా బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. 

 


మొదటగా విధాన సభ ప్రారంభం కాగానే తొలుత సీఎం ఉద్ధవ్ ఠాక్రే తన కేబినెట్ మంత్రులను అందరికీ పరిచయం చేశారు. అనంతరం మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ మాట్లాడుతూ, ప్రొటెం స్పీకర్ నియామకం చట్ట విరుద్ధమనది అని మాట్లాడారు. సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం సరిగా జరగలేదని ఆయన అన్నారు. విశ్వాస పరీక్షకు ముందు ప్రొటెం స్పీకర్‌ ను మార్చడం పైనా ఫడణవీస్ గట్టిగానే  అభ్యంతరం వ్యక్తంచేశారు. 

 

 

స్పీకర్ ఎన్నిక జరగకుండా విశ్వాస పరీక్ష చేయకూడదు అని ఆయన తెలిపారు. అయితే, దీనిపై ప్రొటెం స్పీకర్ దిలీప్ వాల్ నే పాటిల్ స్పందిస్తూ విశ్వాస పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు  ఆదేశాలు ఇచ్చిందన్నారు. తనను గవర్నరే నియమిస్తూ ఇచ్చిన లేఖను ఆయన ఈ సందర్బంగా చదివి వినిపించారు. విశ్వాస పరీక్ష నిర్వహించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. దీనితో బీజేపీ ఎమ్మెల్యేలు పోడియం దెగ్గరికి వచ్చి నినాదాలు చేశారు. 

 

 

ఆ తర్వాత కాంగ్రెస్ సభ్యుడు అశోక్ చవాన్ విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించగా, ప్రొటెం స్పీకర్ హెడ్ కౌంట్ కు ఆదేశించారు. ఈ పరిస్థితులలో బీజేపీ సభాపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్, బీజేపీ  ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లి పోయారు. సభ్యులంతా శాంతించి తమ సీట్లలో కూర్చోవాలని ప్రొటెం స్పీకర్ విజ్ఞప్తి చేసినా దానికి ఫలితం లేకుండా పోయింది. దీనితో సభ తలుపులు మూసివేసి హెడ్ కౌంట్ చేపట్టాలని ప్రొటెం స్పీకర్ ఆదేశాలు చేశారు. ఈ విశ్వాస పరీక్షలో మహా వికాస్ అఘాడీ కూటమికి మొత్తం 169 ఓట్లు పడ్డాయి. అంతక ముందు సీఎం ఉద్ధవ్ ఠాక్రే అసెంబ్లీ వద్దకు చేరుకున్న సందర్భంగా అక్కడ ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి వారు అంజలి ఘటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: