వైసీపీ మంత్రి కురసాల కన్నబాబు సచివాలయం నుండి మీడియాతో మాట్లాడుతూ చరిత్రలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ధర పడిపోతే తక్షణమే అదనంగా ధర ఇప్పించడం, మార్కెట్ ను స్థిరీకరించడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయని చెప్పారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం భారీ వర్షాల వలన కొంత పంట దెబ్బ తినిందని చెప్పారు. 
 
ప్రతిసారి రైతుకు సంబంధించినంత వరకు సమీక్షలు చేస్తూ రైతులతో, రైతు నాయకులతో మాట్లాడుతూ ముందుకు వెళుతున్నామని అన్నారు. దాదాపు 60 లక్షల టన్నుల వరి ధాన్యం మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తోందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1283 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని కురసాల కన్నబాబు చెప్పారు. 1578 ధాన్యం కొనుగోలు చేయాలని మొదట నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 
 
పొలాల నుండే ధాన్యం కొనుగోలు చేయటానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతులకు నగదు జమ అయ్యేలా సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారని కురసాల కన్నబాబు చెప్పారు. నగదు చెల్లింపులలో ఆలస్యం లేదని చెప్పారు. దాదాపుగా 25,000 మంది రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి చెల్లింపులు జరిగాయని కురసాల కన్నబాబు చెప్పారు. 
 
14,000 మంది రైతులకు నగదు చెల్లింపు ప్రాసెస్ జరుగుతోందని కురసాల కన్నబాబు చెప్పారు. గత సంవత్సరం ధాన్యం కొనుగోలు కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బులను అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం నాయకులు దారి మళ్లించారని 2,000 కోట్ల రూపాయల నిధులు పక్కదారి పట్టాయని సీఎం జగన్ రైతులకు ఆ నగదును కూడా చెల్లించారని అన్నారు. ఎక్కడా రైతు నష్టపోకుండా ఉండాలని సీఎం ఆదేశించారని అన్నారు. ఇంగ్లీష్, ఇసుక, రాజధాని అయిపోయిందని ఇప్పుడు ధాన్యం కొనుగోలు, ఉల్లి గురించి టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: