బిజెపి ఎంపీ సుజనా చౌదరి తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ తీసుకున్న నిర్ణయాలపై చురకలు అంటిస్తూ ఆసక్తికర విమర్శలు చేస్తూ.. వార్తల్లోకి ఎక్కుతుంటాడు బిజెపి ఎంపీ సుజనా చౌదరి . అయితే తాజాగా సుజనా చౌదరి పై వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయిరెడ్డి రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాసిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడైన బీజేపీ ఎంపీ సుజనాచౌదరి ఆర్థిక నేరాలపై ఆయన అక్రమ కంపెనీలపై ఫిర్యాదు చేస్తూ రాష్ట్రపతికి లేఖ రాశారు వైసీపీ పార్లమెంటరీ సభ్యులు విజయసాయిరెడ్డి. అంతేకాకుండా ఈ లేఖలో సుజనా చౌదరి మనీలాండరింగ్ వ్యవహారాలపై ఆయన వ్యాపారం కుంభకోణాలపై కూడా విచారణ జరపాలని విజయ సాయి రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
బిజెపి ఎంపీ సుజనాచౌదరి అక్రమ వ్యవహారాలపై ఈడీ సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని కోరుతూ విజయ సాయి రెడ్డి లేఖలో పేర్కొన్నారు. కాగా విజయసాయి రెడ్డి పంపిన లేక పై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్పందించారు. విజయసాయిరెడ్డి లేఖకు బదులిస్తూ లేక వచ్చింది. దీంతో బిజెపి ఎంపీ సుజనా చౌదరి కి భారీ షాక్ తగిలినట్లయింది. బిజెపి ఎంపీ సుజనాచౌదరి పై వైసిపి పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన ఫిర్యాదును పరిశీలించాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కేంద్ర హోంశాఖను ఆదేశించారు.
బిజెపి ఎంపీ సుజనా చౌదరి పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు రామ్ నాథ్ కోవింద్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి కార్యాలయం నోట్ తో రీ డైరెక్ట్ కావడంతో ఆ లేఖను సంబంధిత శాఖలకు పంపింది హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. దీంతో సుజనా చౌదరి పై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరిపొచ్చు ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. లేదా కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండటంతో సుజనా చౌదరి పై వైసీపీ ఎంపీ పార్లమెంటరీ సభ్యులు విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి దర్యాప్తు జరగదు అని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా రాష్ట్రపతి నిర్ణయంతో ప్రస్తుతం బిజెపి ఎంపీ కి భారీ షాక్ తగిలినట్లయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి