ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానిలో అంశమే హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. జగన్ ప్రకటన పై ప్రతిపక్షాల విమర్శలు అమరావతి రైతుల ఆగ్రహజ్వాలతో అంతా హాట్ హాట్ గా మారిపోయింది . పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజధాని అమరావతి మొత్తం హాట్ హాట్ గా మారిపోయింది. అమరావతిలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని అందరూ భయాందోళనకు గురవుతున్నారు. అయితే జగన్ ప్రకటించిన మూడు రాజధానిల  నిర్ణయం పై ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులు అందరూ భిన్న స్వరాలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల నిర్ణయంపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖలు చేశారు. 

 

 

 

 మూడు రాజధాని లపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. సీఆర్డీఏ  కార్యాలయంలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజధాని పేరుతో రైతులను మోసం చేసింది చంద్రబాబు అని... ఇంకా రైతులను మభ్యపెడుతూనే ఉన్నారు అంటూ విమర్శించారు. చంద్రబాబు మాటలను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు మంత్రి బొత్స సత్యనారాయణ. రైతులకు ఇది వరకు ఇచ్చిన హామీలు ప్రభుత్వ నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. అమరావతి నుంచి ఒక సెక్రటేరియట్ వెళ్లిపోయినంత  మాత్రాన అభివృద్ధి ఆగిపోదని బొత్స వ్యాఖ్యానించారు. అన్ని వివరాలు రేపటి కేబినెట్ భేటీలో స్పష్టమవుతాయి అని తెలిపారు. 13 జిల్లాల సమాన అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారని తెలిపారు.

 

 

 

 రాష్ట్రంలోని ఆర్థిక స్థితిపై   ప్రభుత్వం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. చంద్రబాబుకు అవకాశం ఇస్తే 50 వేల కోట్లు అప్పులను రెండు లక్షల 50 వేల కోట్లకు పెంచారు అంటూ విమర్శించారు మంత్రి బొత్స సత్యనారాయణ. అయితే రాజధాని అమరావతి రైతులందరూ భయపడాల్సిన పని లేదని ఆయన తెలిపారు. అమరావతి కోసం ఇప్పటికే 5458 కోట్లు ఖర్చు చేశారని..  అమరావతి నిర్మాణం కోసం 195000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే అందులో ఖర్చు  పెట్టింది నామమాత్రమేనని బొత్స తెలిపారు. ఇందులో 1500 కోట్లు కేంద్రమే ఇచ్చిందని మంత్రి బొత్స తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసమే ప్రాథమిక అంచనా అప్పట్లో లక్షా తొమ్మిది వేల కోట్ల రూపాయలు అన్నారు. అయితే అది ఎంతవరకు పెరుగుతుందో  అంచనా వేయలేమని మంత్రి బొత్స తెలిపారు. ఇప్పుడు వరకు రాజధాని అమరావతి లో పెట్టిన ఖర్చుల వృధా కానివ్వమని.. రేపటి క్యాబినెట్ మీటింగ్ లో అసెంబ్లీ నిర్మాణం పై చర్చిస్తామని మంత్రి బొత్స తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: