ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయ్యే అవకాశం ఉందని ప్రకటన చేసినప్పటికీ అధికారికంగా మాత్రం విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించలేదు. ఏపీ ప్రభుత్వం విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలా...? వద్దా...? అనే నిర్ణయాన్ని కొన్ని రోజుల పాటు వాయిదా వేసిన విషయం విదితమే. ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని వాయిదా వేసినప్పటికీ రాజధాని తరలింపునకు సంబంధించిన పనులు మత్రం జోరుగా జరుగుతున్నాయి. 
 
ప్రభుత్వాధికారులు ప్రధానంగా అడ్మినిస్ట్రేటివ్ విభాగానికి సంబంధించిన భవనాల కొరకు కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. సెక్రటేరియట్ కొరకు ఆంధ్రా యూనివర్సిటీలోని కొన్ని బ్లాకులు కేటాయించాలని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రా యూనివర్సిటీలో కొన్ని బిల్డింగ్ లు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయని సమాచారం. సెక్రటేరియట్ ను ఇక్కడే పెట్టాలని అధికారులు భావించటానికి కొన్ని ముఖ్యమైన కారణాలే ఉన్నాయని తెలుస్తోంది. 
 
ఇక్కడ వాహనాల పార్కింగ్ కు అవసరమైనంత స్థలం ఉండటం మరియు 1500 మందికి సరిపడే భారీ కాన్ఫరెన్స్ హాల్ ఉండటం వలన అధికారులు సెక్రటేరియట్ ను పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ సెక్రటేరియట్ ను పెట్టినప్పటికీ ఆ సెక్రటేరియట్ వలన విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగవని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. అధికారికంగా మాత్రం సెక్రటేరియట్ గురించి ప్రకటన రానప్పటికీ అధికారులు ఇక్కడే సెక్రటేరియట్ పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
సీఎం క్యాంప్ ఆఫీస్ తో పాటు మరికొన్ని అధికారిక భవనాలు కూడా ఇక్కడే వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆధ్వర్యంలో హై పవర్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈరోజు హై పవర్ కమిటీకి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. జగన్ కేబినేట్ లో పలువురు ముఖ్యులు ఈ కమిటీలో ఉన్నారు.చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నీ మూడు వారాల్లోగా కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: