అనేక నేరాలకు మూల కారణం.. అక్రమ సంబంధాలు.. వివాహ వ్యవస్థ ఫెయిల్ కావడం.. ఏదో మొక్కుబడిగా పెళ్లిళ్లు చేసుకుని.. చేసుకున్న వాళ్లతో సంతృప్తి లేక చాలామంది అడ్డదారులు తొక్కుతున్నారు. అవే చివరకు వారి కొంప ముంచుతున్నాయి. మొదట్లో తీయగానే ఉండే ఈ బంధాలు.. ఆ తర్వాత గుదిబండలవుతున్నాయి.
తాజాగా ఇలాంటి అక్రమ సంబంధం చిత్తూరు జిల్లా పీలేరులో ఇద్దరి ప్రాణాలు తీసింది. వివాహేతర సంబంధం కలిగిన ఇద్దరు వ్యక్తులు ఒకే గదిలో ఆత్మహత్యకు చేసుకున్నారు. పీలేరు శివార్లలోని ఓ గదిలో ఈ దారుణం జరిగింది. మృతులను అమరావతి, శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు. వీరి గురించి ఆరా తీస్తే షాకింగ్ విషయాలు వెలుగు చూసాయి.
అదేంటంటే.. వీరిద్దరూ వివాహితులే. ఇద్దరికీ వేర్వేరు పెళ్లిలు అయ్యాయి. వీరు కొంతకాలంగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. శనివారం సాయంత్రం వీరు ఈ గదిలోకి వెళ్లారు. అన్ని తలుపులూ వేసుకున్న తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతకూ తలుపులు తెరుచుకోకపోవడంతో స్థానికులు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి తలుపులు పగలగొట్టి చూస్తే.. ఇద్దరూ చనిపోయి ఉన్నారు. అయితే వీరి ఆత్మహత్యలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కేవలం ఒక సంఘటనే అయినా తరచూ ఇలాంటి అక్రమ సంబంధాల వార్తలు తరచూ మీడియాలో వెలుగు చూస్తున్నాయి. అక్రమ సంబంధం కోసం భర్తనే హత్య చేస్తున్నారు కొందరు మహిళలు.. ఇంకొందరు వివాహేతర బంధం కోసం భార్యలను మట్టుబెడుతున్నారు. ఇటీవల తెలంగాణలో ఓ మహిళ భర్తకు తెలియకుండా ఇద్దరు ప్రియులను మెయింటైన్ చేసింది. ఆ విషయాన్ని భర్త కనిపెట్టి నిఘా పెట్టాడు. దీంతో ఆమె అతడినే ప్రియులతో చంపించే ప్రయత్నం చేసింది. అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ ఫోన్.. పెరిగిన సంబంధాలు, సోషల్ మీడియా.. ఇలా ఎన్నో కారణాలు ఇలాంటి ఘటనలను పెంచుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి