ఏపీ రాజధానిని అమరావతి నుంచి మార్చొద్దంటూ చంద్రబాబు కొన్ని రోజులుగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. రాజధాని గ్రామాలతో పాటు ఇతర నగరాల్లోనూ ఆయన పర్యటిస్తున్నారు. అంతే కాదు.. అమరావతి పోరాటానికి నిధులు సమీకరిస్తున్నారు. స్వయంగా జోలె పట్టి వీధుల్లో తిరుగుతూ విరాళాలు సేకరిస్తున్నారు. ఇక మకర సంక్రాంతి రోజు మరోసారి ఆయన కుటుంబంతో సహా రాజధాని ప్రాంత రైతులకు మద్దతు తెలిపేందుకు వచ్చారు.

 

అయితే ఈ కార్యక్రమానికి ముందు నందమూరి, నారా కుటుంబాల సభ్యులు వస్తారని తెలిపారు. ఈ బృందంలో బాలకృష్ణ భార్య నందమూరి వసుంధర కూడా ఉందని మీడియాకు సమాచారం వెళ్లింది. ఈ మేరకు పలు ఛానళ్లలో స్క్రోలింగులు వెళ్లాయి. దీంతో అమరావతి గ్రామాలకు బాలకృష్ణ భార్య వసుంధర కూడా వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో చివరి నిమిషంలో నారా చంద్రబాబు నాయుడు వెంట.. ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి, నందమూరి రామకృష్ణ ఇతర బంధువులు వచ్చారు.

 

ముందుగా అనుకున్నట్టు నందమూరి బాలకృష్ణ భార్య మాత్రం రాజధాని గ్రామాల పర్యటనకు రాలేదు. చంద్రబాబు చేస్తున్న ఈ రాజధాని గ్రామాల పోరాటానికి గతంలోనూ నారా భువనేశ్వరి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఆమె తన ప్లాటినం గాజులు కూడా ఉద్యమానికి విరాళంగా అందజేశారు కూడా. ఈరోజు మరోసారి భర్త చంద్రబాబు వెంట ఆమె వచ్చారు. చంద్రబాబు వెంట ఆయన కోడలు నారా బ్రహ్మణి కూడా వచ్చారు.

 

కానీ.. బ్రహ్మణి తల్లి నందమూరి వసుంధర మాత్రం రాలేదు. ముందుగా వస్తారన్న సమాచారం లేకుండా ఆమె ఈ కార్యక్రమానికి వస్తున్నట్టు మీడియాలో లీకులు వచ్చే అవకాశం లేదు. అందులోనూ ఆ సమాచారం ఎల్లో మీడియాగా పేరున్న ఛానళ్లలోనే వచ్చాయి. మరి ముందుగా సమాచారం ఉన్నా.. ఆమె ఎందుకు రాలేదోమరి.

మరింత సమాచారం తెలుసుకోండి: