గతంలో చంద్రబాబు సర్కారు అమరావతి భూముల్లో చేరిన అక్రమాలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ఆయన ఒక్కో సంస్థకు ఏ ఏ రేట్లకు భూములు కేటాయించారో చూస్తే దిమ్మతిరగకమానదు. ఎందుకంటే.. ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వ భూమిని ప్రభుత్వ సంస్థలకు ఉచితంగా ఉదారంగా కేటాయిస్తుంది. లేదంటే ఎకరాన్ని నామమాత్రపు ధరకు ఇస్తుంటుంది. అయితే చంద్రబాబు సర్కారు ఈ భూ కేటాయింపుల్లోనూ దందాలకు పాల్పడిందని రుజువవుతోంది.

 

ఎందుకంటే.. ఆర్మీకి, నేవీకి, పోస్టల్‌వాళ్లకు, డిఫెన్స్ వాళ్లకు, కేంద్ర ప్రభుత్వ సంస్థల‌కు ఎక‌రం, అర్రెక‌రం రూ. నాలుగు కోట్లకు రూపాయలకు ఇచ్చింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం.. అంతే కాదు.. కొన్నిసంస్థల‌కు భూమి అమ్మకుండా.... ఏకంగా 60 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. ప్రభుత్వ సంస్థలకే ఇంత రేటు ఇస్తే.. ఇక ప్రైవేటు సంస్థలకు ఇంకెంత రేటుకు ఇచ్చారో అని అనుకోవడం సహజం. కానీ.. ప్రైవేటు సంస్థల‌కు, వ‌ర్సిటీకలకు మాత్రం కేవలం ఎకరాకు రూ. 50 లక్షలకు మాత్రమే కట్టబెట్టేశారు. అంటే.. దాదాపు ప్రభుత్వ సంస్థలకు 7,8 రెట్ల రేటుకు చంద్రబాబు సర్కారు భూమి అమ్మిందన్నమాట.

 

మరో విషయం కూడా చెప్పుకోవాలి. ఆర్మీ, నేవీ వంటి సంస్థలకు ఎకరం, అర ఎకరం.. 0.53 ఇలా గీచి గీచి తక్కువ స్థలం కేటాయించిన చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు, వర్శిటీలకు మాత్రం వందల ఎకరాలు కట్టబెట్టేసింది. ఉదాహరణకు అమృత యూనివర్శిటీకి దాదాపు 200 ఎకరాల భూమి ఏకంగా అమ్మేశారు. అది కూడా ఎకరం రూ. 50 లక్షల రూపాయల ధరకు. విట్ యూనివర్శిటీకి కూడా 200 ఎకరాలు అమ్మేశారు. అది కూడా. రూ. 50 లక్షల రూపాయల ధరకే.

 

 

మెడి సిటికీ 100 ఎకరాలు అమ్మేశారు. అది కూడా సేమ్ టు సేమ్. రూ. 50లక్షల ధరకే. దీనిని బ‌ట్టి వాళ్ల ద్వారా బాబోరికి ఎంత‌లా ముడుపులు ముట్టి ఉంటాయో మనం ఇట్టే ఊహించుకోవచ్చు. ఈ వివరాలను మంత్రి బుగ్గన అసెంబ్లీలో ఆధారాలతో స‌హా వివ‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: