జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు గత కొన్ని నెలల నుండి జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వరుస షాకులు ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నిన్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పవన్ కళ్యాణ్ కు మరోసారి షాక్ ఇచ్చారు. జనసేన పార్టీ శాసన మండలి రద్దును వ్యతిరేకిస్తుంటే రాపాక వరప్రసాద్ మాత్రం శాసన మండలి రద్దు తీర్మానానికి అనుకూలంగా అసెంబ్లీలో ఓటు వేశారు. 
 
రాపాక ఇలా పవన్ కళ్యాణ్ కు షాక్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా రాపాక పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చారు. పలు సందర్భాలలో రాపాక వరప్రసాద్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గతంలో పవన్ కళ్యాణ్ రాపాక వరప్రసాద్ ను సస్పెండ్ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. 
 
కానీ ఆ తరువాత ఆ వార్తలు నిజం కాదని తేలింది. మరోసారి జనసేన పార్టీ విధివిధానాలకు, పవన్ కళ్యాణ్ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించిన రాపాక వరప్రసాద్ ను జనసేన పార్టీ సస్పెండ్ చేస్తుందా...? లేదా...? అనే విషయం తెలియాల్సి ఉంది. రాపాకను పవన్ సస్పెండ్ చేయగలరా...? పవన్ కు అంత దమ్ముందా...? అనే ప్రశ్నలు కూడా కొందరు ప్రజల నుండి వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 
 
రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచినా రాపాక తీరు ఎప్పుడూ వైసీపీ పార్టీకి అనుకూలంగానే ఉంటుంది. గతంలో రాపాక జగన్ ను కోరని కోరికలు కూడా తీర్చే దేవుడు జగన్ అని ప్రశంసించారు. ఈ మధ్య కాలంలో జనసేన పార్టీ నిర్వహిస్తున్న సమావేశాలకు కూడా రాపాక వరప్రసాద్ హాజరు కాలేదు. పార్టీ నిర్ణయాన్ని కాదని ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా రాపాక వరప్రసాద్ ఓటు వేశారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడైనా రాపాక విషయంలో చర్యలు తీసుకుంటారా...? లేదా...? చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: