తమిళ సినిమాల్లో సూపర్ స్టార్ గా,  అభిమానులు తలైవాగా పిలుచుకునే రజనీకాంత్ తొందరలో పాదయాత్ర చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం మొదలైంది. నిజానికి తమిళనాడు రాజకీయాలకు అసలు రజనీకాంత్ పనికొస్తాడా ? అనే చర్చ కూడా సంవత్సరాల తరబడి జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. రజనీ ధైర్యంపై ఎందుకీ చర్చ జరుగుతోందంటే  క్షేత్రస్ధాయిలో జరుగిన పరిణామాలను చూస్తే రజనీ అంత ధైర్యస్తుడు కాడనే విషయం ఎవరికైనా అర్ధమైపోతుంది.

 

తమిళ రాజకీయాల్లో దివంగత ముఖ్యమంత్రి  జయలిలత హవా బాగా నడుస్తున్న రోజుల్లో  ఆమెను అడ్డుకునేందుకు రజనీ రాజకీయాల్లోకి రావాలని చాలా సార్లు అనుకున్నారు.  కొన్నిసార్లు ఏఐఏడిఎంకె కు వ్యతిరేకంగా ఓట్లు వేయాలని కూడా అప్పుడప్పుడు రజనీ అభిమానులకు పిలుపునిచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. పుట్టిన రోజు కావచ్చు లేదా ఏదో ఓ సందర్భంలో రజనీ తన రాజకీయ అరంగేట్రంపై ప్రకటన చేస్తారనే ప్రచారం ఎప్పటికప్పుడు జరగటం తర్వాత తుస్సుమనటం అందరికీ తెలిసిందే.

 

రజనీ రాజకీయాల్లోకి వస్తాడనే మాట ఇపుడు కాదు దాదపు పదిహేనుళ్ళుగా వినబడుతునే ఉంది. మరి ఎందుకు ఎంటర్ కాలేదు ? ఎందుకంటే రజనీ పిరికివాడనే ప్రచారం కూడా ఉంది. రజనీ ఉద్దేశ్యం ప్రకారం రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వగానే పార్టీ బంపర్ మెజారిటితో గెలిచేసి తాను  ఏకంగా ముఖ్యమంత్రి అయిపోవాలి. కానీ అంత సీన్ ఉందా ? ఎవరికీ తెలీదు. ఏదైనా లోతు తెలియాలంటే ముందు నీళ్ళలోకి దిగాలి కదా ? ఆ పనే రజనీ చేయలేకపోతున్నారు.

 

గెలుపు ఓటముల ఆలోచనల మధ్య ఊగుతున్న వ్యక్తి ఇక పార్టీ ఏమి పెడతాడు ? పెట్టిన ఏమి సక్సెస్ అవుతాడు ?  పైగా రజనీకి వయస్సే పెద్ద మైనస్.  దాదాపు 70 ఏళ్ళున్న రజనీ ఇపుడు రాజకీయాల్లోకి వస్తే  చేయగలిగేదేముంటుంది ? పైగా రాష్ట్రంలో పాదయాత్ర చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి మాదిరిగా పాదయాత్ర చేయాలని అనుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో తెలీదు. ఎందుకంటే పాదయాత్ర చేయాల్సిన వయస్సైతే కాదు రజనీది. అసలు రాజకీయాల్లోకి వస్తే కదా జనాలను ఎలా కలవాలో నిర్ణయించుకోవాల్సింది. ముందు రాజకీయాల్లోకి అరంగేట్రాన్ని తేలిస్తే తర్వాత విషయం తర్వాత చూసుకోవచ్చు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: