గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ కు షాక్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 17న 66వ పడిలోకి అడుగుపెట్ట బోతున్నారు. ఫిబ్రవరి 17న జన్మదినం కావడంతో నేతలు, కార్యకర్తలు వేడుకలను గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ నగరంలో ఓ భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. వుయ్ లవ్ కేసీఆర్ అంటూ పెద్ద కటౌట్ లో పెద్ద అక్షరాలతో రాసి ఉంది. ఇందులో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తలసాని ఫొటోలు ఉన్నాయి. 

 

 

ఈ విషయం జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి రావడంతో తలసానికి జరిమానా విధించారు. అనుమతులు లేకుండా భారీ కటౌట్ లను ఏర్పాటు చేయడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాల్టీ అధికారులు 5 వేల రూపాయలు జరిమానా కట్టాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేశారు. గతంలో అనుమతి లేని ఫ్లెక్సీలను తొలగించాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారు. అయితే అధికార పార్టీ కాబట్టి తలసాని యధావిధిగా ఫ్లెక్సీలు పెట్టి ఉండాలి. అయినా మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడం విశేషమే.

 

 

గతేడాది సీఎం కేసీఆర్ బర్త్‌ డే రోజున ఆయన అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలపడానికి క్యూ కట్టారు. దీంతో బేగంపేట, ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ తదితర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది.

 

 

కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా కటౌట్ ఏర్పాటు చేస్తే.. సాక్షాత్తూ ఆయన కేబినెట్ మంత్రిపైనే జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. తమ అధినేత నిరాడంబరత్వానికి అభిమానులు పొంగిపోతున్నారు. ‘లవ్ యూ కేసీఆర్’ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ బర్త్‌ డే సందర్భంగా మొక్కలు నాటాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

 

 

 తెలంగాణ రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ‘హరిత హారం’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మొక్కలు నాటాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: