మహాభారత, రామాయణాలు మనకు నిత్యజీవితంలోని ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతాయి. మార్గదర్శకాలవుతాయి. ఉదాహరణకు ఈ సన్నివేశం చూడండి.. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కావడానికి ముందు అర్జున, దుర్యోధనులు శ్రీకృష్ణుడి సహాయం అర్థించడానికి వెళ్లారు. కృష్ణుడు నిద్రిస్తున్న శయ్య పక్కన ఆసనంపై దుర్యోధనుడు కూర్చున్నాడు. తరవాత వచ్చిన అర్జునుడు కృష్ణుడి పాదాల వద్ద నిలుచున్నాడు.

 

 

కృష్ణుడు ముందు ఎదురుగా నిలిచిఉన్న అర్జునుణ్ని చూశాడు. తరవాత శిరసు పక్కన కూర్చుని ఉన్న దుర్యోధనుడివైపు తలతిప్పాడు. ‘మీ ఇద్దరి రాకకు కారణం ఏమిటి?’ అని కృష్ణుడు ప్రశ్నించాడు. ‘రాబోయే యుద్ధంలో మీ సాయం కోసం వచ్చాం’ అన్నారిద్దరూ. ‘ముందుగా నేను వచ్చాను కాబట్టి నేనే అడుగుతాను ముందుగా’ అన్నాడు దుర్యోధనుడు.

 

 

కృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు- ‘ముందు నువ్వే వచ్చి ఉండవచ్చు! కానీ నేను అర్జునుణ్నే ముందుగా చూశాను. అందులోనూ అర్జునుడు చిన్నవాడు. కాబట్టి ముందుగా అర్జునుడే అడగడం మంచిది. ఇద్దరికీ నేను సహాయం చేస్తా! నేను ఒక్కడిని ఒక పక్క, నా సైన్యంలోని వెయ్యి మంది వీరులు ఒక పక్క ఉంటారు. అర్జునా... ఎవరు కావాలో కోరుకో!’

 

ముందు కోరుకునే అవకాశం వచ్చినా సరే.. అర్జునుడు కేవలం కృష్ణుడినే కోరుకున్నాడు. సైన్యం కంటే... కృష్ణుడే విలువైన ఆస్తి అని గుర్తించాడు. కృష్ణుడినే కోరుకున్నాడు. కానీ దుర్యోధనుడు.. ఇది గ్రహించలేకపోయాడు. పైగా కృష్ణుడికి తిక్క కుదిరింది అనుకున్నాడు. ఫలితంగా మహాభారతయుద్ధంలో ఓడిపోయాడు. ఒక్కసారి ఆయా పాత్రల్లో మిమ్మలి ఊహించుకుని మీరైతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆలోచించండి. తత్వం మీకే బోధపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: