ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయం అంటేనే అవకాశవాదం అన్నట్టుగా తయారైపోయింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు వీర విధేయుడుగా, అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా ముద్ర పడిన యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి టిడిపి కష్టకాలంలో ఉన్నప్పుడు ఆర్థికంగా అండ దండలు అందించడంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి చంద్రబాబు ఆయనకు తగిన ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో పాటు బీజేపీతో పొత్తు కారణంగా కేంద్ర మంత్రి పదవి కూడా ఆయనకు వచ్చింది. 2019 ఎన్నికల్లో టిడిపి దారుణంగా ఓటమి చెందడంతో పాటు వైసిపి సుజనా చౌదరి ఆస్తులను టార్గెట్ చేసుకుని దాడులు జరగడం,  అప్పటికే కేంద్రం ఆదేశాలతో ఐటి శాఖ సుజనతో పాటు మరికొందరు టీడీపీ పెద్దల ఆస్తులను టార్గెట్ చేసుకోవడంతో  సుజనా చౌదరి బాబు సూచనల మేరకు బిజెపిలో చేరినట్లు ప్రచారం జరిగింది. 


ఆయన బిజెపి లోకి వెళ్ళినా మనసంతా టిడిపి, చంద్రబాబు చుట్టూనే తిరుగుతూ ఉండటం తో బిజెపి ప్రతి వ్యూహం చంద్రబాబుకు చేరవేసేవారు అనే  విమర్శలు కూడా వచ్చాయి. ఇక జగన్ తీసుకున్న మూడు రాజధానుల విషయంలో బీజేపీ స్టాండ్ స్పష్టంగా లేకపోయినప్పటికీ సుజనా చౌదరి మాత్రం తీవ్ర స్థాయిలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అమరావతి నుంచి రాజధానిని ఒక్క ఇంచు కూడా కదల్చలేరు అంటూ సవాల్ కూడా విసిరాడు. అప్పటికే అమరావతి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సుజనా చౌదరి భూములు కొన్నట్లు వైసీపీ ప్రభుత్వం లెక్కలు తేల్చడంతో ఆయనకు మరింతగా జగన్ పై ఆగ్రహం పెరిగిందది.


 కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బిజెపి జగన్ కు అండగా ఉండటంతో సుజనాచౌదరి పూర్తిగా అమరావతి విషయం, చంద్రబాబు, టిడిపి విషయాన్ని పక్కన పెట్టేశారు. అసలు ఏపీ వ్యవహారాలతో తనకు సంబంధం లేదన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. తాజాగా చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ చౌదరి ఆస్తులపై ఐటీ రైడ్స్ జరిగినా సుజనా కనీసం బాబుని ఫోన్ లో కూడా పరామర్శించలేదట.ఇదంతా చంద్రబాబుకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఎవరికి వారు తమ తమ అవకాశం చూసుకుని తనను ఒంటరివాడిని చేసేశారని బాబు తన సన్నిహితుల వద్ద వాపోతున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: