తేడా వస్తే మీ పదవులు ఊడతాయి... ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఆపేసి ముందు పని చేయండి ఇలా కొద్ది రోజులుగా తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారు. తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించబోమని, తమకు ఎవరైనా ఒకటేనని, తేడా వస్తే ఇక అంతేనని పదేపదే కేసీఆర్ హెచ్చరిస్తున్నారు. ఇక తెలంగాణ కు కాబోయే  సీఎంగా ప్రచారం జరుగుతున్న కేటీఆర్ కూడా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. ఏ చిన్న తప్పు జరిగినా మీ పదవులు ఊడిపోతాయి అంటూ బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ కేటీఆర్ ఈ విధంగా వ్యాఖ్యానించడంపై పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది.


 ముఖ్యంగా తెలంగాణలో కొత్తగా వచ్చిన మున్సిపల్, పంచాయతీ రాజ్ చట్టం గురించి తరచుగా తండ్రి కొడుకులు ఇద్దరూ ప్రస్తావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సొంత పార్టీ అభ్యర్థులను ఉద్దేశించి కేటీఆర్ ఈ విధంగానే హెచ్చరికలు చేశారు. కొత్త చట్టం ప్రకారం ఎవరైనా తప్పు చేస్తే క్షమించేది లేదని ఆయన అన్నారు. కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్, మేయర్లను ఉద్దేశించి నాలుగు రోజుల క్రితం ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ ఇదే రకంగా వ్యాఖ్యలు చేశారు. ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని, ఫోజులు ఇవ్వడం అపి సక్రమంగా పని చేయకపోతే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అంటూ హెచ్చరించారు. 


ఇక సిరిసిల్లలో కేటీఆర్ పర్యటించిన సందర్భంగా ఇదే రకంగా మాట్లాడారు. సర్పంచులు, ఎంపీటీసీలు చాలా జాగ్రత్తగా తమ బాధ్యతలు నిర్వహించాలని తేడా వస్తే పదవులు ఊడిపోవడం ఖాయమని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో మున్సిపల్ కౌన్సిలర్ లు అంటే చాలా చిన్న చూపు ఉందని ఇది పూర్తిగా మారిపోవాలని, లంచం అనే మాట వినిపించకూడదు అంటూ కేటీఆర్ కాస్త గట్టిగానే హెచ్చరించారు. అయితే దీనిపై పెద్ద దుమారమే రేగుతోంది.


 అయినా మీరు మాత్రం లెక్క చేయడం లేదు. ప్రజల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఇమేజ్ పెరుగుతుందని, సొంత పార్టీ నాయకులు తప్పు చేసినా కేసీఆర్, కేటీఆర్ ఉపేక్షించడంలేదు అనే సందేశం ప్రజల్లోకి బాగా వెళుతుందని వీరిద్దరూ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే పదేపదే బహిరంగంగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: