పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. లోకేష్ ను ఓ మేధావిగా ప్రొజెక్టు చేయటం కోసం చంద్రబాబునాయుడు ఎంతగా ప్రయత్నిస్తున్నా సాధ్యం కావటం లేదు.  ఎందుకంటే చినబాబులో అసలు విషయమే లేదు కాబట్టి. విషయం లేని కొడుకు కోసం  చంద్రబాబు నానా అవస్తలు పడుతున్నాడు. ఇందులో భాగంగానే వ్యక్తిత్వ వికాస పాఠాల్లో ట్రైనింగ్ ఇవ్వటం కోసం లోకేష్ కోసం కొత్తగా ప్రముఖ నవలా రచయితగాను, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు రాయటంలో బాగా పాపులరైన ఓ రచియతను నియమించినట్లు చెప్పుకుంటున్నారు. ఆ రచియిత ఎవరో మీకు ఈ పాటికే తెలిసిపోయుండాలి.

 

నిజానికి లోకేష్ కు తెలుగు మాట్లాడటం కూడా సరిగా రాదనే చెప్పాలి. మాతృభాష తెలుగు అయ్యుండి కూడా తెలుగును సరిగా మాట్లాడలేని వ్యక్తిగా లోకేష్ ఇప్పటికే చాలా పాపులర్. తండ్రి ముఖ్యమంత్రి అన్న ఒకే ఒక్క అర్హత తప్ప మరేమీ అర్హతలు లేకున్నా యువరాజుగా చెలామణి అయిపోతున్నాడు. మొన్నటి ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎలా మాట్లాడినా చెల్లుబాటైపోయింది. కానీ ఇపుడు ప్రతిపక్షంలో కూర్చున్నారు కదా ?  అందుకే ఎక్కడా పప్పులుడకటం లేదు.

 

విచిత్రమేమిటంటే తెలుగులో మాట్లాడటానికి లోకేష్ కు ఓ తెలుగు టీచర్ ను పెట్టి ట్రైనింగ్ ఇప్పించటమే. అంత చేసినా ఉపయోగం కనబడలేదు. ఎందుకంటే లోకేష్ బహిరంగ సభల్లో కానీ ఎక్కడైనా కార్యకర్తల సమావేశాల్లో  నోరిప్పితే నెటిజన్లు పండగ చేసేసుకుంటారు. అందుకే లోకేష్ ఎక్కడా కనబడటం లేదు. ఏదో అమరావతి ఆందోళనలకు తనవంతుగా మద్దతు ప్రకటించటం, లేదా తన దగ్గరకు వచ్చిన వాళ్ళతో మాట్లాడి పంపేయటం వరకే పరిమితమైపోయాడు.

 

పొద్దున లేచిన దగ్గర నుండి ట్విట్టర్లో మాత్రం యమా యాక్టివ్ గా కనిపిస్తుంటాడు. ఎలాగంటే ఘోస్ట్ రైటర్ల సాయంతోనే అనే ప్రచారం కూడా ఉంది లేండి. విషయ పరిజ్ఞానం లేని లోకేష్ కొందరిని ఘోస్ట్ రైటర్లుగా పెట్టుకున్నాడట. అందుకనే సమయం, సందర్భంగా చూసుకుని వాళ్ళే చినబాబు పేరుతో ట్వీట్లు పెట్టేస్తుంటారనే ఆరోపణలకు కొదవే లేదు. ఎలాగూ షెడ్యూల్ ఎన్నికలకు మరో నాలుగేళ్ళుంది. కాబట్టి ఈ కొత్త టీచరైనా లోకేష్ వ్యక్తిత్వంలో మార్పులు తీసుకొస్తే అంతకన్నా కావాల్సిందేముంది ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: